Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త షాట్.. చూస్తే షాక్ అవుతారు (వీడియో)!!

Unbelievable shot in cricket history with Tennis Ball, compares with MS Dhoni Helicopter shot
Viral Video : Unbelievable Shot In Cricket, People Compares With MS Dhoni Helicopter Shot | Oneindia

హైదరాబాద్: క్రికెట్ ఆటలో ఎప్పుడూ ఏదోఒకటి సంచలనంగా మారుతుంటుంది. బ్యాట్స్‌మన్‌, బౌలర్, ఫీల్డర్‌లు తమ అద్భుత నైపుణ్యాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే టీ20లు వచ్చాక క్రికెట్ ఆట మరో స్థాయికి చేరింది. ఆటగాళ్లు తమ ఆటతో క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్‌ చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ చూడని ఓ సరికొత్త షాట్ పరిచయం అయింది. ఆ షాట్‌ను ఏమనాలో కూడా ఎవరికీ తెలియయట్లేదు.

స‌రికొత్త షాట్‌:

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడే హెలికాప్ట‌ర్ షాట్‌ను త‌ల‌పించేలా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే బ్యాట్స్‌మన్‌, బౌలర్ లాంటి వివరాలు ఏమీ తెలియదు కానీ.. ఓ స‌రికొత్త షాట్‌ మాత్రం క్రికెట్ ప్ర‌పంచానికి పరిచ‌యం అయింది. యార్క‌ర్ బంతిని బ్యాట్స్‌మన్‌ తన రెండు కాళ్ల మధ్యలోంచి షాట్ ఆడాడు. బంతి వస్తుండగానే ఓ కాలు లేపి వికెట్ల వెననకు బంతిని తరలించాడు. బంతి మెరుపు వేగంతో బౌండరీ చేరుకుంది.

 సోషల్ మీడియాలో వైరల్:

సోషల్ మీడియాలో వైరల్:

క్రికెట్‌ చరిత్రలోనే సరికొత్త షాట్ ఆడిన ఆ బ్యాట్స్‌మన్‌ను చూసి అక్కడివారందరు ప్రశంసించారు. ఈ వెరైటీ షాట్ టెన్నిస్‌ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ వీడియోకు తెగ లైకులు, కామెంట్లు వచ్చాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు.

రివ‌ర్స్ హెలికాప్ట‌ర్ షాట్:

రివ‌ర్స్ హెలికాప్ట‌ర్ షాట్:

స‌రికొత్త షాట్‌కు వివిధ రకాల పేర్లు పెడుతూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. 'బాక్య్‌వ‌ర్డ్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్‌' అని కొంద‌రు అంటుండగా.. 'రివ‌ర్స్ హెలికాప్ట‌ర్ షాట్' అని మ‌రికొంద‌రు అంటున్నారు. ధోనీ ఆడే హెలికాప్ట‌ర్ షాట్‌ కంటే బాగుంది అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. ఎవరైనా క్రికెటర్ ఈ షాట్‌ను చూస్తే.. త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడతారు అని కామెంట్లు చేస్తున్నారు.

ర‌షీద్ 'నింజా కట్':

తాజాగా ఆఫ్గానిస్థాన్ స్పిన్నర్ ర‌షీద్ ఖాన్ కూడా హెలికాప్ట‌ర్ షాట్‌ను విభిన్నంగా ఆడి వార్తల్లో నిలిచాడు. ర‌షీద్ వికెట్ల వెనుకకు ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నప్పుడు కొట్టిన షాట్ అది. హెలికాప్ట‌ర్ షాట్ వీడియోను ర‌షీద్ సోష‌ల్ మీడియ‌లో పోస్టు చేశాడు. హెలికాప్టర్ షాట్ అని పిలుస్తారా అని కాప్షన్ రాసాడు. హమీద్ హసన్ 'నింజా కట్' అని పేరు పెట్టాడు.

Story first published: Wednesday, March 4, 2020, 15:18 [IST]
Other articles published on Mar 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+