For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ఔట్: లైవ్ మ్యాచ్‌లో షాక్ (వీడియో)

క్రికెట్ లో ఒక బ్యాటర్ 11 రకాలుగా ఔట్ కావచ్చు. అందులో బౌల్డ్, క్యాచ్, స్టంప్, ఎల్బీడబ్ల్యూ సాధారణమైనవి. వీటితో పాటు అరుదుగా జరిగే ఔట్ పద్ధతులలో 'హిట్ వికెట్' ఒకటి. షాట్ ఆడే సమయంలో బ్యాటర్ శరీరం, లేదా బ్యాట్ వికెట్‌ను తాకితే.. అది హిట్ వికెట్‌గా పరిగణించబడుతుంది. అయితే కొన్నిసార్లు బ్యాటర్ ఎలా ఔటయ్యారో చూస్తే నమ్మశక్యం కాదు. అలాంటి సంఘటన ఒకటి కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగింది.

విచిత్రమైన రీతిలో షాయ్ హోప్ ఔట్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL)లో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు ఆటగాడు షాయ్ హోప్ అసాధారణంగా హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. 39 పరుగులతో క్రీజులో ఉన్న హోప్.. రివర్స్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించి తన బ్యాట్‌ను వికెట్‌కు తగిలించాడు. ఒకానొక దశలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న షాయ్ హోప్.. టెర్రెన్స్ హిండ్స్ వేసిన బంతికి ఏబీ డివిలియర్స్ స్టైల్‌లో రివర్స్ ర్యాంప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. హిండ్స్ బంతి ఆఫ్ స్టంప్‌కు చాలా వెలుపలగా వెళ్లింది, అయినా కూడా హోప్ తన బ్యాట్‌ను గట్టిగా తిప్పాడు. అయితే బంతికి తగలకుండా, వైడ్ లైన్ బయట నుంచి తిరిగిన బ్యాట్ నేరుగా వచ్చి వికెట్లను గట్టిగా తాకింది. దీంతో 39 పరుగుల వద్ద హోప్ పెవిలియన్ చేరాడు. ఈ బంతిని అంపైర్ వైడ్‌గా కూడా ప్రకటించారు.

Unbelievable Hit Wicket in CPL 2025 ABD Style Gone Wrong in Live Match

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు సునాయాస విజయం
ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ (TKR) ఈ మ్యాచ్‌లో గయానాపై సులభంగా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గయానా జట్టు 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. షాయ్ హోప్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన క్వెంటిన్ సామ్సన్ మూడు సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. అకీల్ హుస్సేన్ మూడు వికెట్లు తీసుకోగా.. టెర్రెన్స్ హిండ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యఛేదనలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు 18వ ఓవర్‌లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అలెక్స్ హేల్స్, కాలిన్ మున్రో మధ్య 10.3 ఓవర్లలో 116 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. హేల్స్ 43 బంతుల్లో 74 పరుగులు చేయగా, మున్రో 30 బంతుల్లో 52 పరుగులు సాధించాడు. గయానా అమెజాన్ వారియర్స్ కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ నాలుగు వికెట్లు తీసి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు.

Story first published: Sunday, August 31, 2025, 10:33 [IST]
Other articles published on Aug 31, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+