న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎలా సెలక్ట్ అయ్యాడో తెలుసా?: కపిల్ దేవ్ వెల్లడి

Unanimous decision to retain Ravi Shastri as coach, didnt consult Kohli: Kapil Dev


హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌ నియామక ప్రక్రియ ముగిసింది. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. 2017 నుంచి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న శాస్త్రి మరో రెండేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ మేరకు రవిశాస్త్రి నియామకాన్ని ధ్రువీకరిస్తూ క్రికెట్ సలహా కమిటీకి నేతృత్వం వహించిన కపిల్‌దేవ్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

<strong>చివరి అంచె మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి</strong>చివరి అంచె మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి

టీమిండియా మేనేజర్‌, జట్టు డైరెక్టర్‌, కోచ్‌గా ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. రవి శాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకోవడంతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లందరితో రవిశాస్త్రికి మంచి సంబంధాలు ఉండటం కలిసొచ్చింది. రవిశాస్త్రి కోచింగ్‌లో 2015, 2019 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా నిష్ర్కమించి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయినప్పటికీ క్రికెట్ సలహా కమిటీ ఆయననే హెడ్ కోచ్‌గా ఎంపిక చేసింది. మిగతా అభ్యర్థులతో పోలిస్తే రవిశాస్త్రి ఎందుకు భిన్నంగా కనిపించాడు. కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికలో విరాట్‌ కోహ్లీ ఏమైనా ప్రభావం చూపించాడా? లాంటి వార్తలకు క్రికెట్ సలహా కమిటీ హెడ్ కపిల్ దేవ్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం...

కోహ్లీ ప్రభావం ఏ మేరకు

కోహ్లీ ప్రభావం ఏ మేరకు

హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రభావమేమీ లేదని కపిల్‌ దేవ్ వెల్లడించారు. "మేం విరాట్‌ కోహ్లీ అభిప్రాయం తీసుకుంటే మొత్తం జట్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే మేం ఎవ్వరినీ ఏమీ అడగలేదు. అందుకు ఆస్కారమే లేదు. తుది నిర్ణయంపై కోహ్లీ ప్రభావం లేనే లేదు. మేమంతా ఏకగ్రీవంగా రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశాం" అని అన్నారు.

సెమీస్‌ నిష్ర్కమణలపై

సెమీస్‌ నిష్ర్కమణలపై

రవిశాస్త్రి నేతృత్వంలోనే టీమిండియా వరుస ప్రపంచకప్‌ సెమీసుల్లో టీమిండియా నిష్క్రమణపై కపిల్ మాట్లాడుతూ "ఒక జట్టు ప్రపంచకప్‌ గెలవకపోతే మేనేజర్‌ను తొలగించాలా? లేదు మొత్తం పరిస్థితిని పరిశీలించాలి. మేం దాన్ని పట్టించుకోలేదు. ఆయన ప్రజెంటేషన్‌ మాత్రమే చూశాం. ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత టామ్‌ మూడీ మూడులో, మైక్‌ హెసన్‌ రెండులో నిలిచారు. రవిశాస్త్రి టాప్ పొజిషన్‌లో నిలిచారు" అని అన్నారు.

కమ్యూనికేషన్‌‌లో రవిశాస్త్రి ముందంజలో

కమ్యూనికేషన్‌‌లో రవిశాస్త్రి ముందంజలో

"హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా బాగున్నారు. కాకపోతే కమ్యూనికేషన్‌‌లో రవిశాస్త్రి ముందంజలో ఉన్నాడు. ఎంపికలో అదే కీలకంగా మారింది. అందరి ప్రజెంటేషన్లు చూసిన తర్వాతే మార్కులు ఇచ్చాం. ప్రజెంటేషన్‌ కోసం వారెంత కష్టపడ్డారో గమనించాం" అని కపిల్‌ పేర్కొన్నారు.

మార్కులను ఎలా డిసైడ్ చేశామంటే

మార్కులను ఎలా డిసైడ్ చేశామంటే

"మొత్తం ఐదు విభాగాల్లో వారికి మార్కులు వేశాం. అవి కోచింగ్‌, అనుభవం, విజయాలు, కమ్యూనికేషన్‌, ఆధునిక టూల్స్‌పై నాలెడ్జి. చాలా బాగుందికి 20, బాగుందికి 15, ఫర్వాలేదుకు 10, బాగా లేదుకు 5 మార్కులిచ్చాం. నిజాయతీగా చెబుతున్నా. ఎవరెన్ని మార్కులు వేశామో చర్చించలేదు. అన్నీ లెక్క చేసినప్పుడు ముగ్గురి మధ్యన తేడా చాలా చాలా తక్కువగానే ఉంది" అని కపిల్ తెలిపాడు.

Story first published: Saturday, August 17, 2019, 11:13 [IST]
Other articles published on Aug 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X