Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Super Bowling : రెండు ఓవర్లలో ఐదు వికెట్లు.. ఏం బౌలింగ్ రా బాబూ అది..!

 Unadkat takes Hat-trick in first over fifer in two overs

పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేశానన్న సంతోషమో ఏమో కానీ.. సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో దుమ్ముదులిపాడు. తను వేసిన తొలి రెండు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసుకొని, రంజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

బంగ్లాపై కూడా..

బంగ్లాపై కూడా..

దేశవాళీల్లో కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న అతను.. ఇంతకుముందు కూడా సూపర్‌గా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ సిరీస్‌లో రెండో టెస్టులో అతన్ని ఆడించారు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకున్న ఉనద్కత్.. ఆ మ్యాచ్‌లో కూడా రాణించాడు. ఆరంభంలోనే టీమిండియాకు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన అతను.. మళ్లీ సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో బరిలో దిగాడు.

ఒక్కడే 8 వికెట్లు..

ఒక్కడే 8 వికెట్లు..

ఢిల్లీ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్‌ను తుత్తునియలు చేశాడు. తను వేసిన తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ సాధించాడు. ధృవ్ షోరే, వైభవ్ రావల్‌తోపాటు టీమిండియా భవిష్యత్తు అని కొనియాడుతున్న యష్ ధుల్‌ను వరుస బంతుల్లో పెవిలియ్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో మరో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలా కేవలం రెండు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసుకొని అందరికీ పెద్ద షాకే ఇచ్చాడీ సౌరాష్ట్ర కెప్టెన్. ఆ తర్వాత కూడా అతని బౌలింగ్‌లో పదును తగ్గలేదు. మొత్తం 12 ఓవర్లు వేసిన ఉనద్కత్ ఏకంగా 8 వికెట్లు తీసుకొని ఢిల్లీ పతనాన్ని శాసించాడు.

టీమిండియాకు ఆడించాలని డిమాండ్

టీమిండియాకు ఆడించాలని డిమాండ్

ఉనద్కత్ ఇలా రెచ్చిపోవడంతో ఢిల్లీ జట్టు కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఊరికినే ఎలా ఉంటారు. ఇంత గొప్ప బౌలర్‌ను కేవలం ఐపీఎల్ ప్రదర్శన చూసి పక్కన పెట్టడం సరికాదని వాళ్లంతా బీసీసీఐకి సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి ఆటగాడు కచ్చితంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని, ఈ ట్యాలెంట్‌ను వృధా చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా దేశవాళీల్లో చెలరేగుతున్న ఉనద్కత్‌ను వచ్చే నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడించాలని కోరుకుంటున్నారు.

Story first published: Tuesday, January 3, 2023, 17:12 [IST]
Other articles published on Jan 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+