Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

umran malik : రాజకీయ ఉద్ధండులు సైతం ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌కు ఫిదా..!

Umran Malik Should Be Playing In Team India Says Politicians P Chidambaram And Shashi Tharoor

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు లభించిన ఐదు వికెట్లు ఉమ్రాన్ మాలిక్ తీసినవే. తన అద్భుత బౌలింగ్‌తో గుజరాత్ టాప్ ఆర్దర్ తుక్కు రేగ్గొట్టాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ ఒంటరి పోరాటం సన్ రైజర్స్ విజయానికి సరిపోలేదు. చివర్లో రషీద్ ఖాన్, రాహుల్ తేవాతీయా చెలరేగడంతో గుజరాత్ 5వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్లో 22పరుగులు చేయాల్సిన దశలో సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సేన్ బౌలింగ్లో గుజరాత్ బ్యాటర్లు రషీద్, తేవాతీయా 25పరుగులు పిండుకుని గెలిపించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతని ప్రదర్శన పట్ల క్రికెట్ ప్రముఖులే కాకుండా సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అతనిని జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ సర్వత్రా డిమాండ్లు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో మాలిక్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముందంటూ నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సైతం ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శనకు ఫిదా అయిపోయాడు. అతను టీమిండియాకు ఎంపిక కావాల్సిన ప్లేయర్ అని కొనియాడాడు.

'ఉమ్రాన్ మాలిక్ అనే సుడిగాలి తన దారిలో అడ్డొచ్చిన అన్నింటినీ తుడిచిపెట్టేస్తోంది. చురుకైన పేస్, దూకుడు చూడ్డానికి నయనానందకరంగా ఉంది. ఈ ప్రదర్శన తర్వాత.. ఈ ఐపీఎల్ సీజన్లో వెలుగుచూసిన అత్యుత్తమ బౌలర్‌గా అతని పేరు నిలిచిపోవడం ఖాయం. బీసీసీఐ అతనికి ప్రత్యేకమైన కోచ్‌ సపోర్ట్ ఇవ్వాలి. అతన్ని త్వరగా జాతీయ జట్టులోకి తీసుకోవాలి' అని చిదంబరం ట్వీట్ చేశాడు.

మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా అతనిని భారత జట్టులోకి తీసుకోవాలని సూచించారు. 'ఉమ్రాన్ మాలిక్.. త్వరగా టీమిండియా జెర్సీలో కన్పించాలి. ఎంత అద్భుతమైన ప్రతిభ అతనిది. అతను వెలిగిపోతున్న ప్రస్తుత టైంలోనే అతని సత్తాను వినియోగించుకోండి. టెస్ట్ మ్యాచ్ గ్రీన్‌టాప్ కోసం అతన్ని ఇంగ్లాండ్‌కు తీసుకెళ్లండి. అతను, బుమ్రా కలిసి ఇంగ్లీష్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తారు' అని శశి థరూర్ ట్వీట్ చేశాడు.

ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. నటరాజన్ సైతం 15వికెట్లతో ఉమ్రాన్‌తో సమానంగా ఉన్నా ఎకానమీ ఉమ్రాన్‌దే బెటర్‌గా ఉంది. నిన్నటి మ్యాచ్‌లో 4ఓవర్లలో 5వికెట్లు తీసిన మాలిక్ 25పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Thursday, April 28, 2022, 13:46 [IST]
Other articles published on Apr 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+