Inida vs Ireland 1st T20: స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడోచ్.. టీమిండియా ప్లేయింగ్ 11

ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా జట్టును సిద్ధం చేసే ప్రయత్నాల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. నేడు పసికూన ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ ద్వారా తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తుంది. ఇక ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు తొలి మ్యాచ్ డబ్లిన్‌లో జరగనుంది. ఈ సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఇకపోతే స్టార్ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ సన్నాహాకాల్లో ఉన్నారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో ఆడిన జట్టే దాదాపుగా ఐర్లాండ్‌తో తలపడనుంది. హార్దిక్ పాండ్యా తొలిసారి భారత జట్టును లీడ్ చేయబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన జట్టుతో ఉండటంతో వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం
ఇక ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా జట్టులోకి స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టు క్యాప్ అందుకున్నాడు. అతను వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ద్వారా క్యాప్ అందుకున్నాడు. అతను క్యాప్ నంబర్ 98ను పొందాడు. తద్వారా ఈ మ్యాచ్‌లో అతను అరంగేట్రం చేయబోతున్నాడు. అతను దక్షిణాఫ్రికా సిరీస్లో పూర్తిగా బెంచ్‌కే పరిమితం కాగా.. ఈ సిరీస్ ద్వారా తొలిసారి జట్టులోకి అడుగిడబోతున్నాడు. 150కి.మీ వేగంతో బౌలింగ్ వేయగల ఉమ్రాన్‌ను జట్టులో చూడాలని చాలా మంది అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుండగా ఆ తరుణం రానే వచ్చింది.

వర్షం కారణంగా ఆలస్యమైన టాస్
ఇకపోతే వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ కాస్త లేటయ్యేలా ఉంది. కాస్త వర్షం కురవడంతో గ్రౌండ్లో కవర్లు కప్పి ఉంచారు. టాస్ సమయానికి వర్షం తగ్గినప్పటికీ.. కవర్లను తీసేసి మళ్లీ గ్రౌండ్ చదును చేయడానికి టైం పట్టింది. దీంతో టాస్ ఆలస్యమయింది. ఇక గ్రౌండ్లో దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉండడంతో ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు తప్పేలా లేదు. స్టేడియాన్ని సిద్ధం చేశాక ఇరువురు కెప్టెన్లు గ్రౌండ్లోకి వచ్చారు. ఇక తొలి మ్యాచ్‌లోనే టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇండియా టీంకు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం
హార్దిక్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే బౌలింగ్ బాగుంటుందని మాకు అనిపిస్తోంది. ఐర్లాండ్‌లో ఆడడం ఆనందంగా ఉంది. ఇక్కడ అభిమానులను చూస్తుంటే ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక ఇండియాకు కెప్టెన్ కావడం గొప్ప గౌరవం. ఇది అదృష్టంగా భావిస్తున్నా. ఇక కెప్టెన్‌గా నా పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుంది. సహచరులకు మద్దతు ఇస్తాను. స్వేచ్ఛతో ఆడేలా చూస్తాను. మా జట్టు తరఫున ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం చేస్తున్నాడు.' అని హార్దిక్ పేర్కొన్నాడు. ఇకపోతే మరో ఇద్దరు అన్ క్యాప్ట్ ప్లేయర్లు అయిన అర్ష్ దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి తమ మెయిడెన్ క్యాప్ అందుకోవడానికి మరికొంత కాలం వెయిట్ చేయాక తప్పేలా లేదు. ఇక సంజూ శాంసన్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తుది జట్లు
భారత్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్
ఐర్లాండ్ (ప్లేయింగ్ XI) : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రైన్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, కోనర్ ఓల్ఫెర్ట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications