Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డాట్ బాల్స్‌లో సెకండ్ గ్రేట్ బౌలర్‌గా సన్‌రైజర్స్ ప్లేయర్..

umran malik is second highest dotballs in an innings record

సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషనల్ టాలెంట్ ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్లో తన ప్రదర్శనతో క్రికెట్ ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఉమ్రాన్ తన ఆటను ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడంటూ పేర్కొన్నాడు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన 22ఏళ్ల బౌలర్ 150kphసగటు వేగంతో బౌలింగ్ చేస్తూ.. బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఆడిన ఏడు మ్యాచ్‌లలో 21.4సగటుతో, 8.23​​ఎకానమీ రేటుతో 10వికెట్లు తీసుకున్న ఈ స్పీడ్‌స్టార్.. టీమిండియా జట్టు తలుపు తట్టే అవకాశాలున్నాయి.

ఐపీఎల్ చరిత్రలో ఇర్ఫాన్ పఠాన్, లసిత్ మలింగ, జయదేవ్ ఉనద్కత్ తర్వాత 20వ ఓవర్లో మెయిడిన్ బౌలింగ్ చేసిన నాలుగో బౌలర్‌గా మాలిక్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్‌పై చివరి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి మెయిడిన్ వేశాడు. అలాగే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ అత్యంత వేగవంతమైన డెలివరీ (153.3 kphవేగం) వేశాడు. అదే మ్యాచులో 151.2, 150.1, 149.9, 149.3లాంటి వేగవంతమైన డెలివరీలను కూడా అతను సంధించాడు.

ఇక శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. మొత్తం 4ఓవర్లు వేసిన ఈ పేసర్ 19డాట్ బాల్స్ వేశాడు. 1/13ప్రదర్శన కనబరిచాడు. ఇది ఒక ఇన్నింగ్స్‌లో SRH బౌలర్ వేసిన అత్యధిక డాట్ బాల్స్. ఈ క్రమంలో సన్ రైజర్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేస్తూ.. 'డాట్ బాల్స్ విషయంలో మా జమ్మూఎక్స్‌ప్రెస్ మరో ఘనత సాధించింది. సన్ రైజర్స్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ నిలిచాడు.

అలాగే ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల స్థానంలో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు' అని పేర్కొంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్లలో తొలిస్థానంలో దీపక్ చాహర్ (20డాట్ బాల్స్) ఉన్నాడు. ఇక రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ మునాఫ్ పటేల్ (19), సన్ రైజర్స్ ప్లేయర్ ఉమ్రాన్ మాలిక్ (19) కొనసాగుతున్నారు.

Story first published: Monday, April 25, 2022, 9:06 [IST]
Other articles published on Apr 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+