Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : ఉమ్రాన్ ఫాస్టెస్ట్ డెలివరీపై కాంట్రవర్సీ.. లెక్కలోకి రాదా?

Umran Malik fastest delivery in vain because of broadcaster mishap

టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఒక్కో మ్యాచ్ ముగిసే కొద్దీ పరిణితి సాధిస్తున్నాడు. గువాహతిలోని బర్సాపరా మైదానంలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కూడా ఉమ్రాన్ రాణించాడు. మూడు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో అతను అరుదైన రికార్డు బద్దలు కొట్టినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంలో ప్రస్తుతం పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది.

శ్రీలంక ఛేజింగ్‌లో 14వ ఓవర్ ఉమ్రాన్ వేశాడు. ఈ ఓవర్లో నాలుగో బంతి విషయంలోనే కాంట్రవర్సీ వెలుగు చూసింది. దీనికి కారణం హిందీ, ఇంగ్లీష్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ఈ డెలివరీ వేగాలను వేరు వేరుగా చూపారు. ఈ డెలివరీ వేసినప్పుడు బంతి వేగాన్ని హిందీ బ్రాడ్‌కాస్టింగ్‌లో చూపించలేదు. అయితే ఆ తర్వాత ఆ ఓవర్లో అతను వేసిన బంతుల వేగాలను చూపించినప్పుడు మాత్రం.. నాలుగో బంతి వేగం 156 కిలోమీటర్లు అని చూపించారు.

దీంతో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ మరో రికార్డు సృష్టించినట్లు అంతా అనుకున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కూడా ఉమ్రాన్ ఇదే ఫీట్ సాధించాడు. ఆ మ్యాచ్‌లో 155 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి బుమ్రా రికార్డును బద్దలు కొట్టాడు. గువాహతి మ్యాచ్‌లో తన పేరిటే ఉన్న రికార్డును మరోసారి బద్దలు కొట్టినట్లు అంతా అనుకున్నారు. అయితే ఇంగ్లిష్ బ్రాడ్‌కాస్టింగ్‌లో ఈ విషయం అసలు ప్రస్తావనకే రాలేదు.

హిందీలో 156 కిలోమీటర్ల వేగం అని చూపించిన డెలివరీని.. ఇంగ్లిష్ బ్రాడ్‌కాస్టింగ్‌లో కేవలం 145.7 కిలోమీటర్లుగా చూపించారు. దీంతో అభిమానులు దేన్ని నమ్మాలో తెలియక అయోమయంలో పడిపోయారు. కాగా, ఉమ్రాన్ తన కెరీర్‌లోనే అత్యంత ఫాస్టెస్ట్ డెలివరీని గతేడాది ఐపీఎల్‌లో వేశాడు. ఈ సీజన్‌లో అతను 157 కిలోమీటర్ల మార్కును దాటాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా వేగంగా బౌలింగ్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడీ జమ్మూకశ్మీర్ యువ సంచలనం.

Story first published: Wednesday, January 11, 2023, 13:27 [IST]
Other articles published on Jan 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+