Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జైస్వాల్ అవుట్ పట్ల ఏటూ తేల్చుకోలేక‌పోయిన అంపైర్, చివరికి..

 Umpire Bruce Axenford funny reaction to Yashaswi Jaiswal out

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్‌ను 7వికెట్ల తేడాతో ఓడించిన గుజరాత్ టైటాన్స్ సగర్వంగా ప్లేఆఫ్ చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గుజరాత్ హిట్టర్ డేవిడ్ మిల్లర్(38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాజస్థాన్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులను కాపాడుకోలేక రాజస్థాన్ రాయల్స్ ఓటమిని చవిచూసింది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేయగా.. మరో 3బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ లక్ష్యాన్ని ఛేదించింది.

ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 2వ ఓవర్లో యష్ దయాల్ బౌలింగ్లో 3పరుగులకే ఔటయ్యాడు. ఇకపోతే యశస్వి జైశ్వాల్ ఔటయినప్పుడు అంపైర్ వ్యవహరం కాస్త సరదాగా అనిపించింది. 2వ ఓవర్ చివరి బంతిని ఎదుర్కొన్న యశస్వి జైశ్వాల్ బంతి కాస్త ఆఫ్ సైడ్ పడడంతో కాస్త డిఫెండ్ చేయాలని చూశాడు. బంతి బ్యాట్ అంచును తాకి కీపర్ వృద్ధిమాన్ సాహా చేతిలో పడింది. అయితే స్టాంప్ మిక్‌లో క్లియర్‌గా టచ్ అయినట్లు కన్పించింది. కానీ స్ట్రెయిట్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్‌కు అది వినిపించలేదు. అతను డౌట్ ఫుల్ గా ఉన్నాడు. ఓ వైపు యష్ దయాల్, మరో వైపు కీపర్ సాహా అప్పీలు చేస్తుండగా.. అంపైర్ మిన్నకుండిపోయాడు. అయితే గుజరాత్ టైటాన్స్ టీం రివ్యూ కోరుకునే లోపే.. యశస్వి జైశ్వాల్ అది ఔట్ అని ఫిక్సయి గ్రౌండ్ వీడాడు. దీంతో అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫర్డ్ తొలుత నాటౌట్ లాగా అడ్డంగా తలూపి తర్వాత జైశ్వాల్ వెళ్లిపోతుంటే ఔటే ఔటే అంటూ సిగ్నల్ ఇచ్చాడు. ఆ వీడియో క్లిప్ కాస్త నెట్టింటా వైరలైంది.

 Umpire Bruce Axenford funny reaction to Yashaswi Jaiswal out

తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబేడ్ మెక్‌కాయ్
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ

Story first published: Wednesday, May 25, 2022, 8:54 [IST]
Other articles published on May 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+