IND VS AUS Semifinal : సెమీఫైనల్‌లో గిల్, జడేజాతో అంపైర్ గొడవ!.. సర్దిచెప్పిన కోహ్లీ,రోహిత్!!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న కీలక తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో అంపైర్ల ప్రవర్తన కాస్త తేడాగా అనిపిస్తోంది. భారత ఆటగాళ్లతో అంపైర్ ప్రవర్తిస్తోన్న తీరు సరిగ్గా లేదు. ప్రతీ విషయంలో మనోళ్లతో వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ లో ట్రావిస్ హెడ్.. భారత బౌలర్లపై దూకుడుగా ఆడాడు. బౌండరీలు, సిక్సర్లతో కాసేపు హోరెత్తించాడు. దీంతో ఆసీస్ బలమైన పునాది వేసేలానే కనిపించింది. అతడు ఇలానే దూకుడు కొనసాగిస్తే భారత్ కు కాస్త ప్రమాదమే అనిపించింది.
Umpire telling Shubman Gill to hang on the catch for more time and be in complete control. pic.twitter.com/rh3C3QdZka
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025

ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రంగంలోకి దించగా.. అతడు వచ్చీ రాగానే 9వ ఓవర్లో రెండో బంతికే హెడ్ ను పెవిలియన్ పంపాడు. హెడ్ భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. గాల్లోకి ఎగిరిన హెడ్ బంతిని.. లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. దీంతో 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులు చేసిన హెడ్.. రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
— Lolzzz (@CricketerMasked) March 4, 2025
గిల్ కు వార్నింగ్ ఇచ్చిన అంపైర్
అయితే గిల్ పట్టిన క్యాచ్ పై అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది. వెంటనే గిల్ ను పిలిచి స్మాల్ వార్నింగ్ ఇచ్చినట్లు వీడియోలో అర్థమైంది. ఇద్దరి మధ్య కాసేపు కన్వర్జేషన్ జరగడం క్యాచ్ విషయంలో అంపైర్ అసంతృప్తిగా ఉన్నట్లు అనూమానాలకు దారీ తీసింది. బంతిని ఎక్కువ సేపు చేతుల్లోనే ఉంచుకోని, పూర్తి నియంత్రణ వచ్చిన తర్వాతే వదిలేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
VARUN CHAKRAVARTHY IS A NATIONAL HERO...!!! 🇮🇳🔥 pic.twitter.com/BRe552Gfdn
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2025
జడేజాతో కూడా అంపైర్ అలా..
మరోవైపు ఇదే మ్యాచ్ లో జడేజా.. తాను బౌలింగ్ చేసే లెఫ్ట్ హ్యాండ్ అరచేతికి బ్యాండ్ కట్టుకుని ఆడాడు. అయితే అంపైర్ ఇల్లింగ్.. మరోసారి జడేజా దగ్గరికి వచ్చి చేతికి ఉన్న టేప్ తీసేయాలని పట్టుబట్టాడు. కాసేపు ఇద్దరి మధ్య చర్చ సాగింది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గరికి ఏదో సర్దిచెప్పారు. దీంతో జడేజా బ్యాడ్జ్ ను తీసేసి ఆడాడు. అదే బ్యాండ్ రైట్ హ్యాండ్ కు ఉన్నట్టైతే ఎటువంటి ఇష్టూ ఉండేది కాదేమో అన్నట్టుగా కామెంట్లు వచ్చాయి. అలా అంపైర్ రెండు సార్లు భారత ఆటగాళ్ల విషయంలో వాదనకు దిగడంతో వారిపై విమర్శలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications