పాండ్యా నుంచి పర్పుల్ క్యాప్‌ను తిరిగి దక్కించుకున్న ఉమేశ్

హైదరాబాద్: ఐపీఎల్‌లో భాగంగా జరిగిన 31వ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో పర్పుల్ క్యాప్ చేతులు మారింది. ఆరెంజ్ క్యాప్ మాత్రం అంబటి రాయుడు వద్దనే ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఉమేశ్ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఒక్క మ్యాచ్ తేడాతో క్యాప్ పొగొట్టుకున్న ఉమేశ్ యాదవ్ తిరిగి ఇలా సంపాదించుకున్నాడు...

పాండ్యా 2వికెట్లు తీసి పర్పుల్ క్యాప్:
ఆదివారం కోల్‌కతా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా 2వికెట్లు తీసి 19పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ మొత్తంలో అతను తీసిన వికెట్లు 14కు చేరడంతో అతనికి పర్పుల్ క్యాప్ వరించింది. అంతకుముందు జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఉమేశ్ యాదవ్ కూడా 2 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు.

పర్పుల్ క్యాప్‌ను పొంది తన భార్య కోరికను:
అయితే తర్వాత రోజు జరిగిన ముంబై, కోల్‌కతా మ్యాచ్‌లో పాండ్యా కూడా 14 వికెట్లే తీసినా అతని ఎకానమీ రేటును బట్టి పర్పుల్ క్యాప్‌ను డిసైడ్ చేశారు. తిరిగి దానిని పాండ్యా నుంచి ఉమేశ్ యాదవ్ మళ్లీ సంపాదించుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పర్పుల్ క్యాప్‌ను పొంది తన భార్య కోరికను తీర్చానని చెప్పిన ఉమేశ్ యాదవ్ ఒక్క మ్యాచ్ తేడాతో కోల్పోయిన దానిని తిరిగి దక్కించుకున్నాడు.

ఆరెంజ్ క్యాప్ అంబటి రాయుడు దగ్గరే:
పర్పుల్ క్యాప్ సంగతి అలా ఉంచితే, ఆరెంజ్ క్యాప్ ఇంకా అంబటి రాయుడు దగ్గరే ఉంది. బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో ఈ ఐపీఎల్ మొత్తానికి ఐదో సారి హాఫ్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కేవలం 39బంతుల్లోనే 56పరుగులు పూర్తి చేసి ఈ సీజన్‌లో 400పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కానీ, అంతకంటే ముందు వరుసలో అంబటి రాయుడు 423 పరుగలతో ఉన్నాడు.

ప్లే ఆఫ్ అవకాశాలు..బెంగళూరు జట్టు:
జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా విలియమసన్ ప్రశాంతంగా ఉండి జట్టుకు ప్రేరణ కలిపిస్తాడని సునీల్ గవాస్కర్ సైతం కొనియాడాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఈ ధోరణితోనే జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో వైపు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే కనీసం ఇంకా ఐదింటిలో అయినా గెలవాల్సిన పరిస్థితుల్లో బెంగళూరు జట్టు వెనుదిరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications