WTC Finals: విలియమ్సన్‌ను త్వరగా ఔట్ చేయాలి.. లేదంటే: ఉమేష్ యాదవ్

WTC Final : Kane Williamson పై Teamindia కి వార్నింగ్ ఇచ్చిన Umesh Yadav | IndvsNzY| Oneindia Telugu

ఢిల్లీ: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ పోరులో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయాలని టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ అంటున్నాడు. విలియమ్సన్‌ను తొందరగా పెవిలియన్ చేర్చితే భారత జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ జట్లు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. తొలిసారి జరుగుతుండడంతో అందరి దృష్టి ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పైనే ఉంది.

కరోనా గుర్తొచ్చిందో ఏమో.. బ్యాట్స్‌మన్‌కు సాయం చేయకుండా వెళ్లిన బౌలర్ (వీడియో)!

ది టెలిగ్రాఫ్‌కు చఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమేష్ యాదవ్ టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పై స్పందించాడు. 'కేన్ విలియమ్సన్‌ ఆట గురించి మాకు మంచి అవగాహన ఉంది. అయినప్పటికీ అతనికి చాలా బలహీనతలు ఉన్నాయని నేను అనుకోను. అయితే ఎంతటి స్టార్ బ్యాట్స్‌మన్‌ అయినా ఓ మంచి బంతికి ఔట్ అవ్వాల్సిందే. కాబట్టి ఓ ఫాస్ట్ బౌలర్‌గా తన బలాలకు కట్టుబడి ఉండాలి. పదేపదే అలాంటి బంతులు వేస్తె వికెట్లు పడతాయి. మేము కేన్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయాలి. అది జట్టుకు తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది' అని ఉమేష్ పేర్కొన్నాడు.

'న్యూజిలాండ్ బలమైన జట్టు. వారికి లోతైన బ్యాటింగ్ లైనప్ ఉంది. అంతేకాదు కివీస్ పేసర్లు చాలా అనుభవజ్ఞులు, ప్రమాదకారులు. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇంగ్లీష్ పరిస్థితులు కూడా మాకు పెద్ద సవాలు విసిరే అవకాశం ఉంది. అందులోనూ న్యూజిలాండ్ వంటి జట్టుతో అంటే మాములు విషయం కాదు' అని ఉమేష్ యాదవ్ అన్నాడు. ఉమేష్ 48 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు కాని ఇప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఖచ్చితంగా చోటు ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. మొహమ్మద్ సిరాజ్ వంటి యువకులు తమదైన ముద్ర వేయడంతో మనోడికి పోటీ గట్టిపోటీ ఎదురుకానుంది.

ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్ కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకుంది. ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో కేన్ సేన ముందుగా రెండు టెస్టులు ఆడనుంది. మరోవైపు భారత్‌ సైతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమైంది. బుధవారం ముంబైలో జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు ఒక్కచోటికి చేరనున్నారు. అక్కడ వారం పాటు క్వారంటైన్‌లో ఉంటారు. జూన్ 2న ముంబై నుంచి బయలుదేరుతారు. ఇక సౌథాంప్టన్‌ చేరుకున్నాక అక్కడా కఠిన క్వారంటైన్‌లో ఉంటారు. ఆపై ప్రాక్టీస్ చేసి ఫైనల్ ఆడుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 18, 2021, 22:23 [IST]
Other articles published on May 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X