Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఉమేశ్ యాదవ్!!

India vs Westindies 2018 : Shardul Thakur Is Replaced With Umesh Yadav
Umesh Yadav to Replace Injured Shardul Thakur for First Two Windies ODIs

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌తో తొలి రెండు వన్డేల కోసం ప్రకటించిన భారత జట్టులో కీలక మార్పు చేశారు. ఇటీవల విండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఉమేశ్ టీమ్‌లోకి రావడంతో భారత్ పేస్‌విభాగం మరింత బలపడింది.

కోహ్లీకే నాయకత్వ బాధ్యతలు అప్పగించి:

కోహ్లీకే నాయకత్వ బాధ్యతలు అప్పగించి:

ఆసియా కప్‌కు దూరంగా ఉన్న కోహ్లీ విండిస్‌తో వన్డే సిరీస్‌కు తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ వచ్చే ఆదివారం గువహాటిలో జరగనుంది. అయితే టెస్టు సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన రోహిత్ శర్మ... వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావించిన యాజమాన్యం మళ్లీ మార్పులు చేపట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకే నాయకత్వ బాధ్యతలు అప్పగించి వన్డే సిరీస్‌కు సిద్ధం కానుంది.

దినేశ్‌కార్తీక్ స్థానంలో పంత్‌కు

దినేశ్‌కార్తీక్ స్థానంలో పంత్‌కు

హైదరాబాద్ టెస్టులో గొప్పగా రాణించిన స్పీడ్‌స్టర్ 10 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దించిన రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తాడు. నిలకడగా రాణించడంలో విఫలమైన దినేశ్‌కార్తీక్ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు గాను టీమిండియా ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు.

భువనేశ్వర్ స్థానంలో షమీ

భువనేశ్వర్ స్థానంలో షమీ

యువ పేసర్ ఖలీల్ అహ్మద్ చోటు నిలుపుకోగా... భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహమ్మద్ షమీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మనీష్ పాండే, అంబటి రాయుడు, కేఎల్ రాహుల్ సైతం జట్టులో చోటు దక్కించుకున్నారు. యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు మూడో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు.

మొదటి రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా:

మొదటి రెండు వన్డేలు ఆడనున్న టీమిండియా:

విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కె ఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, ధోనీ (వికెట్ కీపర్ ), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, చహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్‌

Story first published: Tuesday, October 16, 2018, 19:00 [IST]
Other articles published on Oct 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+