న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మూడు వన్డేలకు జట్టును ప్రకటించారు. ఉమేష్ యాదవ్, బూమ్రా, షమీలు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. రవీంద్ర జడెజా, అశ్విన్‌లకు విశ్రాంతినిచ్చారు.
ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు జట్టును ప్రకటించారు. దాదాపు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడిన జట్టునే ఎంపిక చేశారు.

శ్రీలంక సిరీస్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్‌కు నిరాశ ఎదురయింది. 16 మంది సభ్యుల జట్టులో ఆయనకు చోటు దక్కలేదు.
తొలి మూడు వన్డేలకు భారత జట్టు
విరాట్ కోహ్లీ (సారథి), రోహిత్ శర్మ, శిఖర్ దావన్, కెఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అజింక్యా రహానే, ధోనీ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహాల్, బూమ్రా, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్, షమీ