హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విండిస్ పర్యటనలో ఉన్న టీమిండియా పేసర్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు షాకిచ్చే ఫోటోను పోస్ట్ చేశాడు.
ఇంతకీ ఆ ఫోటోలో ఏముందని అనుకుంటున్నారా! కరేబియన్ దీవుల్లో దొరికే ఎండ్రకాయలను తలకిందులుగా పట్టుకుని ఫోటో. చూడటానికి భారీ ఆకారంలో ఉన్న ఎండ్రకాయలను చూసిన ఉమేశ్ వాటిని పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు.
ఈ ఫోటోను చూసిన ఉమేశ్ యాదవ్ ఫాలోవర్లలో కొందరు ప్లీజ్ వాటని తినొద్దని అంటే.. మరికొందరు డిన్నర్‌కు మంచి వంటకాన్ని సిద్ధం చేస్తున్నారన్నమాట అంటూ కామెంట్లు పోస్టు చేశారు. మరికొందరు ఇవేంటో తెలియక తికమక పడి వీటి పేరేంటి అంటూ ఉమేశ్‌ను ప్రశ్నించారు.
ఇంకొందరు 'అవి మనుషుల్ని తినేట్టు కనిపిస్తున్నాయి.. వాటిని మీరెలా పట్టుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విండిస్ పర్యటలో ఉన్న టీమిండియా ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరి వన్డేను గురువారం కింగ్‌స్టన్ వేదికగా ఆడనుంది. ఈ సిరిస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది.