నాలుగో వన్డేలో అరుదైన ఘనత: 100 వికెట్ల క్లబ్‌లో ఉమేశ్ యాదవ్
హైదరాబాద్: టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు వేదికగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో ఉమేశ్ యాదవ్ వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వికెట్‌తో ఉమేశ్ యాదవ్ కెరీర్‌లో వందో వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.
ఇన్నింగ్స్ 35.5వ బంతికి ఓపెనర్ ఫించ్‌ను ఔట్ చేసి 99వ వికెట్ తీశాడు. ఆ తర్వాత 37.1వ బంతికే ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (3)ను పెవిలియన్ పంపి వంద వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఉమేశ్ బౌలింగ్‌లో బంతిని క్రాస్‌గా ప్లిక్ చేసేందుకు స్టీవ్ స్మిత్ ప్రయత్నించాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ క్యాచ్‌గా అందుకున్నాడు.

2010, మే 28న జింబాబ్వేపై అరంగేట్రం
2010, మే 28న జింబాబ్వేతో జరిగిన వన్డేతో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్‌కి ఇది 71వ వన్డే మ్యాచ్. తన కెరీర్‌లో 69 ఇన్నింగుల్లో ఉమేశ్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లోనూ ఈ ఘనతకు చేరువలో ఉన్నాడు. 34 టెస్టులాడి 66 ఇన్నింగ్స్‌లలో 94 వికెట్లు తీశాడు.

స్టీవ్ స్మిత్‌ను అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఏడుసార్లు
ఇదిలా ఉంటే నాలుగో వన్డేలో ఉమేశ్ యాదవ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఏడుసార్లు అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్.. స్మిత్‌ను ఇప్పటి వరకు 9 సార్లు అవుట్ చేశాడు. బ్రాడ్ తర్వాత స్మిత్‌ను ఎక్కువ సార్లు అవుట్ చేసింది ఉమేశే.
భారత్ టార్గెట్ 335
నాలుగో వన్డేలో భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 335 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో వార్నర్ (124) సెంచరీ, ఫించ్ (94) పరుగులతో రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 231 పరుగులు జోడించారు.

భారత బౌలర్లపై విరుచుకుపడ్డ ఆసీస్ ఓపెనర్లు
బౌండరీల వర్షం కురిపిస్తూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాదవ్ .. వార్నర్‌ను అవుట్ చేయడంతో వీళ్లద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ఫించ్ (94), స్మిత్ (3) కూడా అవుటవ్వడంతో ఆసీస్ స్కోరు నెమ్మదించింది. చివర్లో హ్యాండ్స్‌కాంబ్ (43) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications