For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Embarrassing Moment: బౌలింగ్ వేస్తూ జారిపడ్డ ఉమేశ్ యాదవ్ (వీడియో)

Umesh Has Embarrassing Moment Trying to Bowl His First Ball of Oz Summer

హైదరాబాద్: సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ కెప్టెన్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది.

పృథ్వీషా (66), పుజారా (54), విరాట్‌ కోహ్లీ (64), అజింక్య రహానె (56), హనుమ విహారి (53), రోహిత్‌ శర్మ (40) రాణించారు. అనంతరం రెండోరోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా ఎలెవన్ బ్యాట్స్ మెన్లు ఆడేందుకు సిద్ధమైన తరుణంలో ఉమేశ్ యాదవ్ బౌలింగ్ వేసే క్రమంలో జారిపడ్డాడు.

కాలు జారి కిందపడ్డ ఉమేశ్ యాదవ్

అయితే, అతడికి గాయాలేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండో రోజు ఆటలో భాగంగా తొలి బంతికే ఉమేశ్‌ యాదవ్‌ జారి కిందపడటంతో కాస్త భయపడ్డారు. బంతి వేసేందుకు ఉమేశ్‌ పరుగెత్తుతూ వచ్చాడు. వికెట్ల దగ్గర లూప్‌లో భాగంగా ఎగిరినప్పుడు వెనక కాలు జారింది.

 వీడియో సోషల్ మీడియాలో వైరల్

వీడియో సోషల్ మీడియాలో వైరల్

దాంతో ఉమేశ్ యాదవ్ ఒక్కసారిగా కిందపడటంతో రెండు సార్లు దొర్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే యువ ఓపెనర్ పృథ్వీషా గాయపడడంతో సిరిస్ ప్రారంభానికి ముందు టీమిండియాటు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా జరిగే తొలిటెస్టుకు పృథ్వీ షా దూరమైన సంగతి తెలిసిందే.

డ్రాగా ముగిసిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్

డ్రాగా ముగిసిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్

ఇదిలా ఉంటే, సిడ్నీ వేదికగా టీమిండియా, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన నాలుగురోజుల వార్మప్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మురళీ విజయ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం చివరి రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా 43.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.

 తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన విజయ్, రాహుల్

తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన విజయ్, రాహుల్

శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌లు తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించిన తర్వాత హాఫ్‌ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్‌(62) ఔటయ్యాడు. ఆ తర్వాత హనుమ విహారీతో కలిసి విజయ్‌ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

వార్మప్ మ్యాచ్‌లో మురళీ విజయ సెంచరీ

ఈ క్రమంలో మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. టీ20 మాదిరి దూకుడుగా ఆడిన మురళీ విజయ్ తొలి హాఫ్‌ సెంచరీ సాధించడానికి 91 బంతులు తీసుకోగా... ఆ తర్వాత మరింతగా రెచ‍్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి కేవలం 27 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మొత్తం 132 బంతులను ఎదుర్కొన్న విజయ్‌ 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు.

39వ ఓవర్‌లో 26 పరుగులు రాబట్టిన మురళీ విజయ్

39వ ఓవర్‌లో మురళీ విజృంభించాడు. ఆసీస్ బౌలర్ జేక్ కార్డర్ వేసిన ఈ ఓవర్‌లో మురళీ విజయ్ బౌండరీలతో చెలరేగాడు. రెండు సిక్సులు, మూడు బౌండరీలతో 26 పరుగులు రాబట్టాడు. 44వ ఓవర్‌లో మురళీ విజయ్‌ ఔటైన తర్వాత మ్యాచ్‌ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకి ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసి ఆలౌటైన ఆస్ట్రేలియా ఎలెవన్

అనంతరం, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 544 పరుగులు చేసి ఆలౌటైంది. హ్యారీ నీల్సన్‌(100) సెంచరీతో రాణించగా, షార్ట్‌ ( 74), మ్యాక్స్‌ బ్రయాంట్‌ ( 62), అరోన్‌ హార్డీ(86)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్‌ తీశాడు.

వార్మప్ మ్యాచ్‌‌లో వికెట్ తీసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ

శనివారం సౌత్‌ ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ హ్యారీ నీల్సన్‌ను ఔట్‌ చేశాడు. 170 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీ చేసి జోరుమీదున్న హరీ నీల్సన్‌ వికెట్‌ తీయడం విశేషం. కోహ్లీ సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. వికెట్‌ తీసిన అనంతరం తన సహచర ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటూ "కెప్టెన్ వికెట్‌ తీసిన వేళ" అంటూ క్యాష్షన్ పెట్టింది.

Story first published: Saturday, December 1, 2018, 15:32 [IST]
Other articles published on Dec 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+