Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్, ధోనీ, కోహ్లీలను చూసి నేర్చుకో తమ్ముడూ.. ఉమర్‌కు కమ్రాన్‌ సూచన!!

Umar Akmal should learn from Sachin, Dhoni, Kohli says brother Kamran Akmal

కరాచీ: మైదానం లోపలా బయటా ఎలా వ్యవహరించాలో భారత స్టార్లు సచిన్‌ టెండూల్కర్‌, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాలని తన సోదరుడు, పాకిస్తాన్ ఆటగాడు ఉమర్‌ అక్మల్‌కు వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్ సూచించాడు. భారత ఆటగాళ్లను చూసి ఉమర్‌ బుద్ధి తెచ్చుకోవాలన్నాడు. ఉమర్‌పై తాజాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మూడేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

 సచిన్, ధోనీ, కోహ్లీలను చూసి నేర్చుకో:

సచిన్, ధోనీ, కోహ్లీలను చూసి నేర్చుకో:

తాజాగా కమ్రాన్‌ అక్మల్‌ మాట్లాడుతూ... 'ఉమర్‌ ఇంకా యువకుడు. అతను తప్పు చేసి ఉంటే ఇతరులను చూసి నేర్చుకోవాలి. జీవితంలో ఎన్నో ప్రలోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో సచిన్, ధోనీ, కోహ్లీ జీవితాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. వివాదాలకు దూరంగా సచిన్‌ నీతిగా క్రికెట్‌ ఆడాడు. ధోనీ, కోహ్లీ, బాబర్‌ ఆజమ్‌ల నుంచి ఉమర్‌ ఇంకా చాలా నేర్చుకోవాలి' అని అన్నాడు.

చాలా కఠినమైన శిక్ష:

చాలా కఠినమైన శిక్ష:

తన సోదరుడికి వేసింది చాలా కఠినమైన శిక్ష అని కమ్రాన్ అక్మల్ ఇదివరకే అన్నాడు. 'ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం ఆశ్చర్యపరిచింది. ఇది చాలా కఠినమైన శిక్ష. కచ్చితంగా అతను ఈ నిషేధంపై అప్పీల్‌కి వెళ్తాడు. గతంలో ఇదే తప్పిదానికి పాల్పడిన మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ నవాజ్‌లకి ఇంత పెద్ద శిక్ష పడలేదు. కానీ ఇప్పుడు ఉమర్ విషయంలో మాత్రం మరీ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు' అని కమ్రాన్ ప్రశ్నించాడు.

 మూడేళ్ల నిషేధం:

మూడేళ్ల నిషేధం:

కరోనా వైరస్ కారణంగా చివరలో నిలిచిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఆరంభానికి ముందు బుకీలు ఫిక్సింగ్ కోసం ఉమర్‌ని సంప్రదించారు. కానీ ఈ విషయాన్ని పీసీబీ అవినీతి నిరోధక శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చే వరకూ ఉమర్ వారికి సమాచారం ఇవ్వలేదు. దీంతో రెండు నెలలు విచారణ జరిపిన పీసీబీ క్రమశిక్షణ కమిటీ.. మూడేళ్ల పాటు క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనూ ఉమర్ ఆడకుండా నిషేధం విధించింది.

శ్రీలంకపై చివరి టీ20 మ్యాచ్‌:

శ్రీలంకపై చివరి టీ20 మ్యాచ్‌:

గతేడాది ఆగస్టులో శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తరపున అక్మల్ చివరిసారి ఆడాడు. ఆ సిరీస్‌లో అక్మల్‌ విఫలం కావడంతో.. అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాకిస్తాన్‌ జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం వాయిదా పడిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) ఆడేందుకు సిద్దమయ్యాడు. కానీ.. ఇంతలోనే పీసీబీ అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. 29 ఏళ్ల ఉమర్‌ అక్మల్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 టీ20లు ఆడాడు

Story first published: Thursday, April 30, 2020, 8:29 [IST]
Other articles published on Apr 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+