Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్, లారా, పాంటింగ్‌ల‌ు గొప్ప ఆటగాళ్లు కాదు: అక్తర్ సంచ‌ల‌నం

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్ తన దృష్టిలో అత్యంత గొప్ప ఆటగాళ్లు కాదని వ్యాఖ్యానించాడు. పాక్ మాజీ క్రికెటర్ 'వసీం అక్రమ్ టాక్ షో'లో పాల్గొన్న షోయబ్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన షోయబ్ టాక్ షోలో భాగంగా బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఈ ముగ్గురిలో ఎవరూ కాదని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది గొప్ప బ్యాట్స్‌మెన్లను చాలా కష్టమైనా సరే వారిని ఏదో విధంగా ఔట్ చేయగలిగానని షోయ‌బ్ అక్త‌ర్ అన్నాడు.

Inzamam-ul-Haq the best batsman I

అయితే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్‌ను ఔట్ చేయడం ఎంతో క‌ష్ట‌మ‌ని పేర్కొన్నాడు. నెట్స్‌లో ఒక్కసారి కూడా ఇంజ‌మాన్‌ని తాను ఔట్ చేయలేకపోయానని చెప్పుకొచ్చాడు. అతడి ఫుట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఉండేద‌ని చెప్పాడు. బంతిని కచ్చితంగా అంచనా వేసి ఇంజ‌మామ్ ఎదుర్కునేవాడ‌ని పేర్కొన్నాడు.

అందుకే తన బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో ఇంజమామ్ అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని, అతడితో సరితూగే బ్యాట్స్‌మెన్ లేడని, ఎవరితోనూ అతడిని పోల్చి చూడలేమని అక్తర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఇటీవలే పీసీబీ ఇంజిమామ్‌ను పాకిస్థాన్ జట్టు ఛీప్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అంతక ముందు ఆప్గనిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+