Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లే తర్వాత...: పలాష్ ఒక్కడే పది వికెట్లు తీశాడు

భోపాల్: భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే పదిహేడేళ్ల క్రితం ఒక ఇన్నింగ్సులో పదికి పది వికెట్లు పడగొట్టి నెలకొల్పిన రికార్డును మధ్యప్రదేశ్ లెగ్ స్పిన్నర్ పలాష్ కొచ్చర్ సమం చేశాడు. రాష్ట్రస్థాయి టోర్నీ ఇంటర్ డివిజనల్ ఎంవే మెమోరియల్లో ట్రోఫీలో నర్మదపురంపై జరిగిన మ్యాచ్‌లో పలాష్ ఓ ఇన్నింగ్సులోపది వికెట్లు పడగొట్టాడు.

ఈ ఇన్నింగ్సులో 28.1 ఓవర్లు వేసిన పలాష్ 53 పరుగులు ఇచ్చాడు. పది వికెట్లు తీశాడు. ఇందులో పది మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. పలాస్ గత కొంతకాలంగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు పది వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు.

Ujjain's Palash scalps 10 wicket in an innings

రాష్ట్రస్థాయి పోటీల్లో ఒక ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 1999లో ఢిల్లీ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచులో కుంబ్లే పది వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే అంతర్జాతీయ మ్యాచులో ఈ ఘనత సాధిస్తే పలాష్ రాష్ట్రస్థాయి పోటీల్లో సాధించాడు.

కాగా, 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ ఒక ఇన్నింగ్సులో పది వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఆ తర్వాత 43 ఏళ్ల తర్వాత అనిల్ కుంబ్లే ఆ ఘనతను సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+