Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ రికార్డు: 43 ఏళ్ల వయసులో టీ20 ప్రపంచకప్‌కు!

మరో 25 రోజుల్లో టీ20 వరల్డ్ కప్‌ ప్రారంభం కానుంది. అమెరికా, యూఎస్‌ఏ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నఈ మహా సమరంలో 20 జట్లు తలపడనున్నాయి. అయిదు టీమ్స్ చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పోటీపడనున్నాయి. మరోవైపు ఈ మెగాటోర్నీలో పాల్గొనే తమ జట్లను అన్ని దేశాలు క్రమంగా ప్రకటిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉగాండ ప్రకటించిన జట్టు ఆసక్తికరంగా ఉంది. జట్టులో 43 ఏళ్ల ఆఫ్‌స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా చోటు దక్కించుకున్నాడు. అతడు తుది జట్టులో చోటు సంపాదిస్తే అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. 15 మందితో కూడిన జట్టును ఉగాండ క్రికెట్ అసోషియేషన్ సోమవారం ప్రకటించింది.

Uganda s Frank Nsubuga Oldest Player at T20 World Cup 2024

మెగాటోర్నీలో ఉగాండను బ్రియాన్ మసాబా నడిపించనున్నాడు. రియాజత్ అలీషా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా, ఆఫ్రికా క్వాలిఫయిర్స్ రీజన్‌లో ఫైనల్‌లో రెండో స్థానంలో నిలవడంతో ఉగాండ టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. గ్రూప్-సిలో పోటీపడనుంది. ఈ గ్రూప్‌లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్, బలమైన న్యూజిలాండ్‌, సంచలన టీమ్ అఫ్గానిస్థాన్‌, పసికూప పపువా న్యూ గినియాలతో ఉగాండ తలపడనుంది.

జూన్ 3న అఫ్గానిస్థాన్‌తో ఉగాండ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 5న పపువా న్యూ గినియా, జూన్ 9న వెస్టిండీస్, జూన్ 15న న్యూజిలాండ్‌తో పోటీపడనుంది. కాగా, జూన్ 2 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో యూఎస్‌ఏ-కెనడా తలపడనున్నాయి.

ఉగాండా జట్టు: బ్రియాన్‌ మసాబా (కెప్టెన్), రియాజత్‌ అలీ షా, కెన్నెత్‌ వైస్వా, దినేశ్‌ నక్రాని, ఫ్రాంక్‌ సుబుగా, రోనక్‌ పటేల్‌, రోజర్‌ ముకాసా, కోస్మాస్‌ క్యెవుటా, బిలాల్‌ హసున్‌, ఫ్రెడ్‌ అచెలమ్‌, రాబిన్సన్‌ ఒబుయా, సిమోన్‌ సెసాజి, హెన్నీ సెన్యోండో, అల్పేష్‌ రాజ్‌మణి, జుమా మియాజి.

Story first published: Tuesday, May 7, 2024, 9:11 [IST]
Other articles published on May 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+