
హైదరాబాద్: భారత అండర్ 19 జట్టు కెప్టెన్‌కు అభినందనలతో పాటు ఆవాసం కూడా దొరికింది. అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలబెట్టిన భారత జట్టు కెప్టెన్ పృథ్వీ షాను బుధవారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే అభినందించాడు. ఇంతకుముందు మీడియా సమావేశంలో పాల్గొన్న పృథ్వీ షా తాను మంచి ఇల్లు కట్టుకోవాలని పేర్కొన్నాడు.
ఈ విషయమై ముంబైలో నివాసం ఉండేందుకు ఇల్లు సమస్య లేకుండా చూస్తానని స్థానిక ఎమ్మల్యే భరోసా ఇచ్చాడు. ముంబైలోని స్థానిక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కలిసిన పృథ్వీ షాను శివసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే థాకరే అభినందించాడు. ఇంకా కెప్టెన్ గా అతను ఘనతను సాధించాడని కొనియాడాడు.
''పృథ్వీ ఆట మీదే దృష్టి పెట్టాలి. ఇల్లు గురించి అతను ఆలోచించాల్సిన అవసరం లేదు. అతనికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటాం. పృథ్వీ సాధించిన విజయం గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. మమ్మల్ని గర్వపడేలా చేశాడు'' అని థాకరే అన్నాడు.
ఇటీవలే పృథ్వీ ఇంటి విషయమై ముఖ్యమంత్రి ఫడణవీస్ తో మాట్లాడానని చెప్పాడు. త్వరలోనే అతనికి ముంబైలో ఇల్లు ఏర్పాటు చేస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అతను కేవలం ఆట మీద దృష్టి పెడితే చాలని ఇంటి విషయం గురించి తాము చూసుకుంటామని మాటిచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.