Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens Asia Cup 2024: నేపాల్ చారిత్రక విజయం

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి మహిళల ఆసియా కప్ ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే రికార్డులు నమోదయ్యాయి. ఆరంభమ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై నేపాల్ మహిళల జట్టు ఆరు వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టిన నేపాల్‌కు ఉమెన్స్ ఆసియా కప్‌లో ఇదే తొలి విజయం.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. ఖుషీ శర్మ (36; 39 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్. కవిష (22; 26 బంతుల్లో, 2 ఫోర్లు) పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లలో కెప్టెన్ ఇందు బర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టింది.

UAEW vs NEPW Nepal Women Secure Their First Ever Win in Women s Asia Cup History

ఆది నుంచే యూఏఈ వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఇషా (10; 9 బంతుల్లో, 2 ఫోర్లు) రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరింది. నేపాల్ బౌలర్లు చెలరేగడంతో 46 పరుగులకే యూఏఈ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన ఖుషీ, కవిష ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వారిద్దరు గేర్ మార్చి దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు చేజార్చుకున్నారు.

అనంతరం ఛేదనలో నేపాల్ 16.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ సంఝనా (72 నాటౌట్; 45 బంతుల్లో, 11 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో యూఏఈ బౌలర్లపై విరుచుకుపడింది. సహచరులు వెనుదిరిగుతున్నా ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చింది. సంఝనా ఆది నుంచే దూకుడగా ఆడగా, మరో ఓపెనర్ సీతారానా (7; 17 బంతుల్లో, 1 ఫోర్) నిదానంగా ఆడింది. అయితే సీతారానా వికెట్‌ను ఎక్కువసేప కాపాడుకోలేకపోయింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కబిత (2), ఇందు (6), రుబినా (10) వరుసగా వికెట్లు చేజార్చుుకున్నా సంఝనా జట్టును సునాయాసంగా గెలిపించింది.

Story first published: Friday, July 19, 2024, 20:08 [IST]
Other articles published on Jul 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+