Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ మేము నిర్వహిస్తాం.. బీసీసీఐకి మరో దేశం ఆఫర్!!

UAE offers to host IPL 13, BCCI ‘yet to decide’

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ధాటికి క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. విశ్వవ్యాప్తంగా ఏ టోర్నీ, ఏ సిరీస్‌ ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో క్రికెట్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చే టోర్నీ ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) లీగ్ కూడా కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఈ లీగ్ రద్దు కావడంతో.. ఫ్యాన్స్‌లో నిరుత్సాహం నెలకొంది. అంతేకాక దీనిపై ఆధారపడి ఉన్న పలువురికి తీవ్రస్థాయిలో నష్టం ఏర్పడింది.

ఎస్‌ఎల్‌సీ ఆఫర్

ఎస్‌ఎల్‌సీ ఆఫర్

ఐపీఎల్‌ను ఖాళీ స్టేడియంలలో అయినా నిర్వహించాలనే వాదనలు ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. పలువురు మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఐపీఎల్‌ నిర్వహించడానికి తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్ ‌(ఎస్‌ఎల్‌సీ) ఇప్పటికే బీసీసీఐకి ఆఫర్‌ చేసింది. తాజాగా యూఏఈకి ఇదే ఆఫర్‌ను బీసీసీఐ ముందు ఉంచినట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు.

ఐపీఎల్‌ మేము నిర్వహిస్తాం

ఐపీఎల్‌ మేము నిర్వహిస్తాం

;ఐపీఎల్‌ 2020 నిర్వహించేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు పూర్తి స్థాయి అనుమతులు లేని నేపథ్యంలో దాని గురించి మాట్లాడే ప్రశ్నే లేదు' అని అరుణ్‌ ధుమాల్‌ అన్నారు. ఐపీఎల్‌ నిర్వహించడం యూఏఈకి కొత్తేమీ కాదు. 2014లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడంతో అక్కడ 20 మ్యాచ్‌లు జరిగాయి. ఇక 2019లోనూ ఇదే సమస్య ఏర్పడినా.. ఐపీఎల్‌ను వేరే దేశానికి మార్చటం ఇష్టం లేక సీజన్‌ని స్వదేశంలోనే పూర్తి చేశారు.

ఐపీఎల్ నిరవధిక వాయిదా

ఐపీఎల్ నిరవధిక వాయిదా

షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్ 2020 ప్రారంభం కావాల్సి ఉండే. కరోనా కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఏప్రిల్ 14వ తేదీ వరకూ ప్రకటించిన లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకూ పొడిగించడంతో.. ఈ సీజన్‌తో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ఎత్తివేత గురించి కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణ గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రీషెడ్యూల్‌ చేసేందుకు కసరత్తులు

రీషెడ్యూల్‌ చేసేందుకు కసరత్తులు

ఐపీఎల్‌ను భారత్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ రీషెడ్యూల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బయో సెక్యూర్‌ స్టేడియాలపై కసరత్తులు ప్రారంభించింది. అయితే దేశంలో అనేక ప్రాంతాల్లో రెడ్‌ జోన్లు‌ ఉండటంతో అది సాధ్యపడటం లేదు. 2009 (దక్షిణాఫ్రికా), 2014ల్లో మాదిరిగా ఐపీఎల్‌ను విదేశాల్లో నిర్వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు అరుణ్‌ ధుమాల్‌ సమాధానం ఇస్తూ.. ‘ఆటగాళ్లు, టోర్నీలో పాల్గొనే వ్యక్తుల ఆరోగ్యం, భద్రతకే మా మొదటి ప్రాధాన్యం' అని సమాధానం ఇచ్చారు.

Story first published: Sunday, May 10, 2020, 20:43 [IST]
Other articles published on May 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+