
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా కప్ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత తొలగింది. 2018 ఆసియా కప్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) అబుదాబి, దుబాయిల్లో నిర్వహించనుంది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ సీఈఓ రాహుల్ ఆధ్వర్యంలో తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, ఈసీబీ అధ్యక్షుడు షేక్ ముబారక్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
నిజానికి, ఈ ఏడాది ఆసియా కప్‌ను భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. భారత్‌లో ఆసియా కప్‌ను నిర్వహిస్తే పాకిస్థాన్ పాల్గొనడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో యుఏఈలో ఈ టోర్నీ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు యూఏఈ, బీసీసీఐ మధ్య ఒ ప్పందం కుదిరింది.
సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు అబుదాబి, దుబాయిలలో ఆసియాకప్ జరగనుంది. భారత్ తరపున ఈ పోటీలను యూఏఈలో నిర్వహిస్తున్నామని, అభి మానులు ఈ పోటీలను ఆదరిస్తారని ఆశిస్తు న్నట్టు బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చెప్పారు. ఈ టోర్నీలో భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు ఓ క్వాలిఫయర్ జట్టు ఆసియా కప్‌లో తలపడనుంది.