Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: న్యూజిలాండ్ జట్టులో తెలుగు కుర్రాడు

అండర్-19 ప్రపంచకప్‌నకు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది.జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ వరల్డ్ కప్‌నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తుంది. అయితే కివీస్ జట్టులో తెలుగు కుర్రాడు స్నేహిత్ రెడ్డి చోటు సంపాదించాడు. న్యూజిలాండ్‌లో స్థిరపడిన స్నేహిత్ తల్లిదండ్రుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో చలివేంద్రపాలెం.

న్యూజిలాండ్‌లోనే పెరిగిన స్నేహిత్ అండర్-11, అండర్-17 టోర్నమెంట్‌లో సత్తాచాటాడు. ఆ ప్రతిభతోనే స్పిన్ ఆల్‌రౌండర్ ఆయన స్నేహిత్ అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు.కాగా, స్నేహిత్ తండ్రి శివరామక్రిష్ణారెడ్డి కూడా క్రికెటరే. ఆంధ్రాలో అండర్-13 క్రికెట్ టోర్నీ ఆయన ఆడారు. కాగా, న్యూజిలాండ్ అండర్-19 జట్టులో మరో ఇద్దరు ఆటగాళ్లకు కూడా ఓ ప్రత్యేకత ఉంది.

U19 World Cup: Telugu boy selected in New Zealand team

మరో స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎంపికైన జాక్ కమింగ్ కివీస్ మాజీ ఓపెనర్ క్రైగ్ కమింగ్ కుమారుడు. అలాగే న్యూజిలాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జెరెమీకొని మనవడు టామ్ జోన్స్ కూడా అండర్19 జట్టులో చోటు సంపాదించాడు. ఇక అండర్-19 టీమిండియాలో తెలంగాణ యువ ప్లేయర్లు అరవెల్లి అవనీశ్ రావ్, మురుగన్ అభిషేక్ చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.

18 ఏళ్ల అవనీశ్ వికెట్ కీపర్ బ్యాటర్ కాగా, 19 ఏళ్ల అభిషేక్ ఆల్‌రౌండర్.బ్యాటింగ్ తో పాటు ఆఫ్ స్పిన్నర్‌గానూ రాణిస్తున్నాడు. అవనీశ్ రావు సిరిసిల్ల నియోజకవర్గంలోని పోత్గల్ గ్రామానికి చెందినవాడు. మురుగన్ అభిషేక్ హైదరాబాద్‌కు చెందినవాడు.

భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌

Story first published: Sunday, December 17, 2023, 10:27 [IST]
Other articles published on Dec 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+