Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: టీమిండియా ఘన విజయం.. సెమీస్‌లో భారత్!

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 214 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.ముషీర్ ఖాన్ (131; 126 బంతుల్లో) శతకంతో కదం తొక్కగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 295 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 28.1 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వద్ద అర్షిన్ కులకర్ణి (9; 9 బంతుల్లో) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ముషీర్ ఖాన్ మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (52; 58 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఆదర్శ్ అర్ధశతకం సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే అతడు పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 77 పరుగులు జోడించారు.

U19 World Cup: Team Indias great victory over New Zealand. India into the semifinals

అనంతరం సహచరులు వరుసగా వెనుదిరుగుతున్నా ముషీర్ మరో ఎండ్‌లో నిలబడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పరుగులు జోడిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 109 బంతుల్లో సెంచరీని సాధించాడు. అనంతరం గేర్ మార్చి దూకుడుగా పరుగులు సాధించాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ శతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఉదయ్ (34; 57 బంతుల్లో), అరవెల్లి అవనీశ్ (17; 18 బంతుల్లో) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మసోన్ క్లార్క్ నాలుగు వికెట్లు తీశాడు.

ఛేదనలో భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ విలవిలలాడింది. తొలి ఓవర్‌లోనే రాజ్ లింబాని రెండు వికెట్లతో కివీస్‌ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికి టామ్ జోన్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన లింబాని.. అయిదో బంతికి స్నేహిత్ రెడ్డిని వికెట్లముందు దొరబుచ్చుకున్నాడు. దీంతో ఖాతా తెరవకముందే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కివీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. సౌమి పాండే చెలరేగాడు. 10 ఓవర్లు వేసి 19 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. రాజ్ లింబాని రెండు, ముషీర్ ఖాన్ రెండు వికెట్లతో సత్తాచాటారు. నమన్ తివారి, అర్షిన్ కులకర్ణి చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ (19; 38 బంతుల్లో) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్తు దాదాపు ఖరారైనట్లే. కాగా, సూపర్ సిక్స్‌లో టీమిండియా తన ఆఖరి మ్యాచ్ శుక్రవారం నేపాల్‌తో ఆడనుంది.

Story first published: Wednesday, January 31, 2024, 8:20 [IST]
Other articles published on Jan 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+