వరుసగా పదో విజయం.. అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా వరల్డ్ రికార్డు!!

U19 World Cup: India U19 Team creates history with 10 consecutive wins

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): పేసర్‌ కార్తీక్‌ త్యాగి (4/24) ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చడంతో అండర్‌-19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత ప్రపంచకప్‌ రన్నరప్‌ ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. త్యాగి ఆరంభంలోనే కంగారు పెట్టగా.. ఆకాశ్‌ సింగ్‌ (3/30) కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా టోర్నీ నుండి భారంగా నిష్క్రమించింది.

India vs Australia: స్లెడ్జింగ్ చేసాడు.. ఆ తర్వాతి బంతికే ఔట్ అయ్యాడు (వీడియో)

వరుసగా పదో విజయం

వరుసగా పదో విజయం

తాజా విజయంతో యువ భారత్ పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది. ఆసీస్‌పై సాధించిన విజయం అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా పదో విజయం. దీంతో ప్రపంచకప్‌లో వరుసగా పది విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా వరల్డ్ రికార్డును ఖాతాలో వేసుకుంది. 2018-2020 మధ్యలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో భారత్ వరుసగా పది విజయాలు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. 2002-04 మధ్యలో ఆసీస్ వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది.

ఎనిమిది వరుస విజయాలు మూడుసార్లు

ఎనిమిది వరుస విజయాలు మూడుసార్లు

అండర్‌-19 ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిది విజయాలు సాధించిన జట్ల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. భారత్ మూడుసార్లు ఈ ఘనత అందుకుంది. 2000-02, 2008-10, 2012-14లలో మూడుసార్లు వరుస ఎనమిది విజయాలు ఖాతాలో వేసుకుంది. ఇక బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా కూడా గతంలో వరుసగా ఎనిమిది విజయాలు సాధించాయి.

టీమిండియా @ 200

టీమిండియా @ 200

తాజా విజయంతో టీమిండియా యూత్ క్రికెట్లో 200 మార్కును అందుకుంది. దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. మొత్తంగా 261 మ్యాచ్‌లాడిన భారత్.. 200 విజయాలు, 56 ఓటములు నమోదు చేసింది. రెండు టై మ్యాచ్‌లు ఉండగా.. మరో మూడింట్లో ఫలితం రాలేదు. మరోవైపు భారత గెలుపోటముల నిష్పత్తి బాగానే ఉంది.

యువ భారత్ విజయం

యువ భారత్ విజయం

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత అండర్‌-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకొలేకర్‌ (54 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలు చేసారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 43.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. కార్తీక్‌ త్యాగి (4/24) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కంగారూలు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్‌ సామ్‌ ఫనింగ్‌ (75) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్‌ 3 వికెట్లు తీసాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, January 29, 2020, 12:04 [IST]
Other articles published on Jan 29, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more