అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత యువ జట్టు అదరగొట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇటీవల టీమిండియా టెస్టు జట్టులో చోటు సంపాదించుకున్న సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ శతకంతో కదం తొక్కాడు. 126 బంతుల్లో 131 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 28 పరుగుల వద్ద అర్షిన్ కులకర్ణి (9; 9 బంతుల్లో) ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ముషీర్ ఖాన్ మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (52; 58 బంతుల్లో)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఆదర్శ్ అర్ధశతకం సాధించాడు. అయితే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే అతడు పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 77 పరుగులు జోడించారు.

అనంతరం సహచరులు వరుసగా వెనుదిరుగుతున్నా ముషీర్ మరో ఎండ్‌లో నిలబడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పరుగులు జోడిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 109 బంతుల్లో సెంచరీని సాధించాడు. అనంతరం గేర్ మార్చి దూకుడుగా పరుగులు సాధించాడు. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముషీర్ శతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఉదయ్ (34; 57 బంతుల్లో), అరవెల్లి అవనీశ్ (17; 18 బంతుల్లో) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మసోన్ క్లార్క్ నాలుగు వికెట్లు తీశాడు.
మరోవైపు జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో దూరమవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్ రెండో టెస్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమైనప్పుడే సర్ఫరాజ్‌కు అవకాశం వస్తుందని భావించారంతా. కానీ సెలక్టర్లు రజత్ పటిదార్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు గాయాలతో మరో ఇద్దరు జట్టుకు దూరమవ్వడంతో సర్ఫరాజ్‌కు ఛాన్స్ ఇచ్చారు. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో అతడు సెంచరీల మోత మోగిస్తున్నాడు.