Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup: టీమిండియాకు ఎంపికైన సిరిసిల్ల బిడ్డకు కంగ్రాట్స్- KTR

అండర్-19 ప్రపంచకప్‌నకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెగాటోర్నీతో పాటు ముక్కోణపు సిరీస్‌కు కూడా జట్టును వెల్లడించింది. జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌నకు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తుంది. ఈ మెగాటోర్నీ కంటే ముందు ఇంగ్లాండ్, సౌతాఫ్రికాతో ఈ నెల 29 నుంచి జనవరి 10 వరకు భారత్ ట్రై సిరీస్ ఆడనుంది.

అయితే తెలంగాణ యువ ప్లేయర్లు అరవెల్లి అవనీశ్ రావ్, మురుగన్ అభిషేక్ ప్రపంచకప్ తో పాటు ముక్కోణపు సిరీస్ జట్టులో చోటు సంపాదించారు. 18 ఏళ్ల అవనీశ్ వికెట్ కీపర్ బ్యాటర్, 19 ఏళ్ల అభిషేక్ ఆల్‌రౌండర్. బ్యాటింగ్ తో పాటు ఆఫ్ స్పిన్నర్‌గానూ రాణిస్తున్నాడు. కాగా, వీరిద్దరు ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 ఆసియాకప్ లోనూ టీమిండియాలో ఉన్నారు.

U19 World Cup: Congratulations to Sirisillas cricketer being selected for Team India- KTR

భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌

అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపికైన టీమిండియాపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. తెలంగాణ నుంచి ఎంపికైన మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావుకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్పారు. ''అండర్-19 ప్రపంచకప్‌తో పాటు ముక్కోణపు సిరీస్‌కు ఎంపికైన అరవెల్లి అవనీశ్ రావుకు హృదయపూర్వక అభినందనలు. ఈ భవిష్యత్ తార.. సిరిసిల్ల నియోజకవర్గంలోని పోత్గల్ గ్రామానికి చెందినవాడు'' అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో హైదరాబాద్‌కు చెందిన మురుగన్ అభిషేక్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.

Story first published: Thursday, December 14, 2023, 14:18 [IST]
Other articles published on Dec 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+