For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు అండర్-19 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ దక్కలేదు.. ఎందుకో తెలుసా?

జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టును 100 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇంతటి ఘనవిజయం సాధించినా కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నుంచి భారత జట్టుకు ఎలాంటి నగదు బహుమతి లభించదు. దీని వెనుక ఉన్న కారణాలు, యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం.

ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
సాధారణంగా సీనియర్ వరల్డ్ కప్ గెలిచిన జట్లకు ఐసీసీ కోట్ల రూపాయల నగదు బహుమతిని అందజేస్తుంది. కానీ అండర్-19 టోర్నమెంట్‌ను ఐసీసీ కేవలం ఓ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(అభివృద్ధి కార్యక్రమం)గా మాత్రమే పరిగణిస్తుంది. యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడానికి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన వేదిక ఇది అని ఐసీసీ భావిస్తుంది. అందుకే ఈ టోర్నీలో పాల్గొనే ఏ జట్టుకు ప్రత్యేకంగా నగదు బహుమతులు కేటాయించదు.

U19 World Cup 2026 Why India Won t Get Prize Money from ICC Vaibhav Suryavanshi Records

మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే.. ఐసీసీ తన వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని ఇప్పటికే అన్ని సభ్య దేశాల క్రికెట్ బోర్డులకు (BCCI వంటివి) డెవలప్‌మెంట్ ఫండ్స్ రూపంలో అందజేస్తుంది. ఆ నిధులను యువ ఆటగాళ్ల శిక్షణకు, టోర్నీల నిర్వహణకు వాడుకోవాలని సూచిస్తుంది. కాబట్టి, మళ్లీ ప్రత్యేకంగా ప్రైజ్ మనీ ఇవ్వడం వల్ల అది 'డబుల్ రివార్డ్' కిందకు వస్తుందని ఐసీసీ తన విధానాన్ని స్పష్టం చేసింది.

బీసీసీఐ నుంచి నజరానా ఖాయం!
ఐసీసీ నగదు ఇవ్వకపోయినప్పటికీ.. మన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం మన కుర్రాళ్లను ఖాళీ చేతులతో ఉంచదు. గత చరిత్రను పరిశీలిస్తే, విజేతలకు బీసీసీఐ భారీగా రివార్డులు ప్రకటించింది. ఉదాహరణకు 2022లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు యశ్ ధుల్ సేనలోని ప్రతి ఆటగాడికి రూ.40 లక్షల చొప్పున నగదు అందించింది. అదేవిధంగా, అండర్-19 మహిళల జట్టుకు రూ.5 కోట్ల భారీ పూల్ మనీని ప్రకటించింది. ఈసారి కూడా ఆయుష్ మాత్రే నేతృత్వంలోని జట్టుకు బీసీసీఐ నుంచి భారీ నజరానా అందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
ఈ టోర్నీ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ అద్భుత ప్రదర్శనతో వైభవ్ ఒకే టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' గెలుచుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 439 పరుగులు సాధించి, తనలోని అసమాన ప్రతిభను చాటుకున్నాడు.

Story first published: Saturday, February 7, 2026, 9:45 [IST]
Other articles published on Feb 7, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+