For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండర్‌-19 ప్రపంచకప్‌.. ఫైనల్లో భారత్‌ ప్రత్యర్థి ఎవరంటే?!!

U19 World Cup 2020: Bangladesh thrash New Zealand, to meet India in maiden final

పొచెస్‌ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌తో తలపడే జట్టేదో తేలిపోయింది. న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో బంగ్లా ఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌ తొలిసారి మెగాటోర్నీ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో టైటిల్‌ కోసం ఆదివారం భారత్‌తో బంగ్లా తలపడనుంది.

టాప్ ఆర్డర్ విఫలం:

టాప్ ఆర్డర్ విఫలం:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి న్యూజిలాండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మారియూ (1), వైట్‌ (18).. లెల్‌మన్‌ (24), కెప్టెన్‌ తష్కాఫ్‌ (10) విఫలం కావడంతో కివీస్ 74 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయిన కివీస్ పీకల్లోతు కష్టాలో పడింది.

ఆదుకున్న బెకమ్‌ వీలర్‌:

ఆదుకున్న బెకమ్‌ వీలర్‌:

ఈ సమయంలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బెకమ్‌ వీలర్‌ (83 బంతుల్లో 75 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్‌ లిడ్‌స్టోన్‌ (74 బంతుల్లో 44; 2 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ జోడి ఐదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. దీంతో కివీస్ కాస్త పుంజుకుంది. అయితే బంగ్లా బౌలర్లు మరోసారి రెచ్చిపోవడంతో 43 పరుగుల వ్యవధిలో మరో 4 వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్‌ ఇస్లామ్‌ 3.. షమిమ్‌ హొసేన్‌, హసన్‌ మురద్‌ చెరో రెండు వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేశారు.

ఆరంభంలో బంగ్లాకు షాక్:

ఆరంభంలో బంగ్లాకు షాక్:

లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 44.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బంగ్లాకు ఛేదనలో సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు తన్‌జీద్‌ (3), పర్వేజ్‌ (14) త్వరగానే విఫలమయ్యారు. మహ్మూదుల్‌ హసన్‌ జాయ్‌ (127 బంతుల్లో 100; 13 ఫోర్లు) అద్భుత బ్యాటింగ్‌తో శతకం చేసి జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. అతడికి తౌహిద్‌ హృదోయ్‌ (40; 47 బంతుల్లో 4x4), షహదత్‌ హొసేన్‌ (40నాటౌట్‌; 51 బంతుల్లో 4x4) మంచి సహకారం అందించడంతో బంగ్లా విజయం దిశగా సాగింది.

మహ్మూదుల్‌ సెంచరీ:

మహ్మూదుల్‌ సెంచరీ:

తౌహీద్‌తో మూడో వికెట్‌కు 68 పరుగులు, షహాదత్‌తో నాలుగో వికెట్‌కు 101 పరుగులను మహ్మూదుల్‌ జోడించాడు. సెంచరీ పూర్తయిన అనంతరం మహ్మూదుల్‌ వెనుదిరిగాడు. యూత్‌ క్రికెట్‌లో అతనికి ఇది నాలుగో శతకం కావడం విశేషం. అక్బర్‌ అలీ (5 నాటౌట్‌) ఫోర్‌ బాది మరో 35 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. కివీస్ బౌలర్లలో డేవిడ్‌ హెన్‌కాక్‌ , ఆదిత్య అశోక్‌ తలో వికెట్ తీశారు.

భారత్‌ మెరుగైన ప్రత్యర్థి:

భారత్‌ మెరుగైన ప్రత్యర్థి:

మ్యాచ్ అనంతరం బంగ్లా కెప్టెన్‌ అక్బర్‌ అలీ మాట్లాడుతూ...'ఫైనల్‌కు రావడం సంతోషంగా ఉంది. ఫైనల్లో భారత్‌ మెరుగైన ప్రత్యర్థి. అయినా మేము ఏ మాత్రం ఆందోళనకు గురికాము. భారత్‌ను ఓడించాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలి. ఇది మా తొలి ఫైనల్‌ అనే భావన దరిచేరనివ్వం' అన్నాడు. తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో నెగ్గిన యువ భారత్‌ వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Story first published: Friday, February 7, 2020, 9:11 [IST]
Other articles published on Feb 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+