
భారత్ మ్యాచ్‌లు
ఈ ప్రపంచకప్‌లో భారత యువ జట్టు ఈ నెల 15 నుంచి తన వేట మొదలు పెట్టనుంది. 15న తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇక 19న ఐర్లాండ్‌తో, 22న ఉగాండాతో తలపడుతుంది. కాగా ఈ టోర్నీని భారత యువ జట్టు ఇప్పటికే 4 సార్లు గెలుచుకుంది. 2000లో తొలిసారి కైఫ్ సారథ్యంలో యువ భారత్ అండర్ 19 ప్రపంచకప్ గెలిచింది.
ఆ తర్వాత 2008లో ప్రస్తుత టీమిండియా సీనియర్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రెండో సారి ట్రోఫీ అందుకుంది. ఇక 2012లో ఉన్ముక్త్ చంద్ కెప్టెన్సీలో, చివరగా 2018లో పృథ్వీ షా సారథ్యంలో భారత్ కప్ గెలుచుకుంది. కాగా ఇటీవల ఆసియా కప్ గెలిచి జోరు మీదున్న యువ భారత్ ప్రపంచకప్‌ను కూడా గెలవాలని పట్టుదలగా ఉంది. ఆసియా కప్‌లో భారత్ జట్టుకు సారథ్యం వహించిన యశ్.. ఈ టోర్నీలోనూ టీమిండియాను నడిపించనున్నాడు. జట్టులో ఉన్న తెలుగు కుర్రాడు షేక్ రషీద్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

కరోనా కలకలం
ఈ ప్రపంచకప్ కోసం నిర్వహించిన బయో బబుల్ పటిష్ఠంగానే ఉన్నప్పటికీ జింబాబ్వే, పాకిస్థాన్ జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. అలాగే కరోనా నేపథ్యంలో తమ దేశంలో మైనర్లకు కఠిన ఆంక్షలు విధించడంతో న్యూజిలాండ్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం అవడంతో అఫ్గానిస్థాన్ లేట్‌గా వెస్టిండీస్ చేరుకుంది. దీంతో గ్రూప్- సి మ్యాచ్‌ల్లో నిర్వాహకులు మార్పులు చేశారు.

ఏ గ్రూప్‌లో ఏ జట్టు
గ్రూప్- ఎ లో బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లాండ్, యూఏఈ
గ్రూప్- బి లో భారత్, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండా
గ్రూప్- సి లో జింబాబ్వే, అఫ్గానిస్థాన్, పపువా న్యూ గునియా, పాకిస్థాన్
గ్రూప్- డి లో స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా.


Click it and Unblock the Notifications












