For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతా ద్రవిడ్ వల్లే: మనకు అలాంటి కోచ్ లేడు, పాక్ ఫ్యాన్స్ అసంతృప్తి

By Nageshwara Rao
U-19 World Cup: India won because of Rahul Dravid but we had no one, say dejected Pak fans

హైదరాబాద్: ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌ హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన రెండో సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి యువ భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. పాక్ ఓటమితో అక్కడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు భారత్ జట్టుకు ద్రవిడ్‌లాంటి లెజెండ్ కోచ్‌గా ఉన్నాడని, పాక్‌కు మాత్రం అలాంటి వ్యక్తి లేకపోవడం ఈ ఓటమికి ట్వీట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అండర్-19 వరల్డ్ కప్‌లో టోర్నీలో పాకిస్థాన్ జట్టుకు మన్సూర్ రానా కోచ్‌గా వ్యవహారిస్తున్నారు. ఇతడు కేవలం పాక్ తరుపున రెండు వన్డేలాడి 15 పరుగులు చేశఆడు. ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అలాంటి వ్యక్తిని కోచ్‌గా ఎందుకు నియమించారోనని పాక్ అభిమానులు ట్విట్టర్‌లో మండిపడుతున్నారు.

మరోవైపు పాకిస్థాన్‌పై భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ భవిష్యత్తు అసలు సిసలైన వ్యక్తి చేతుల్లోనే ఉందని క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. కాగా, ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది. ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో మూడు సార్లు వరల్డ్ కప్‌లను గెలుచుకున్నాయి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 13:36 [IST]
Other articles published on Jan 30, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+