Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నిన్నటి ఫలితాలు తారుమారు.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

U-19 World Cup: India Thrash South Africa in Warm-up Fixture

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా దక్షిణాఫ్రికాకు భారత్‌కు మధ్య మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 182పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అండర్ 19 ప్రపంచకప్ పోటీలను ఉద్దేశ్యంలో ఉంచుకుని ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ను నిర్వహించారు.

ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లీ సేన తొలి టెస్టుతో ఓటమిని చవిచూసింది. మరో పక్క పృథ్వీ షా నాయకత్వంలోని టీమిండియా సఫారీ జట్టుపై విజయం సాధించి క్రికెట్ అభిమానులకు కాస్తంత సంతోషాన్ని అందించింది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచుకున్న భారత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆర్యన్‌ జుయాల్‌(86), హిమాన్షు రాణా(68) అద్భుతంగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత్‌ 8 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 143 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్‌ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత బౌలర్‌ ఇషాన్‌ పోరెల్‌ నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. జనవరి 13 నుంచి అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభంకానున్నాయి. జనవరి 14న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఢీకొననుంది. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లే ముందు పృథ్వీ షా నాయకత్వంలోని భారత అండర్‌-19 జట్టు కోహ్లీని కలిసి పలు సూచనలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ జట్టులో పాల్గొననున్న జట్లలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ జాసన్ సంఘా కూడా భారత సంతతికి చెందిన వాడే. భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, పాపా న్యూ గినియా జట్ల మధ్య జరుగుతున్న ఈ సిరీస్‌లో విజేతలెవరో చూడాల్సిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 16:53 [IST]
Other articles published on Jan 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+