Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U 19 World Cup: యువ భార‌త్ చ‌రిత్ర సృష్టించేనా.. ఇంగ్లండ్‌తో ప్ర‌పంచ‌క‌ప్‌ ఫైన‌ల్ నేడే

U 19 World Cup: India on the verge of winning the Fifth World Cup.. India vs England final match today
U19 World Cup Final, India Vs England Match Details| IND Eye 5th Title | Oneindia Telugu

వెస్టిండీస్‌: భారత అండ‌ర్ 19 క్రికెట్ జ‌ట్టు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క ఫైన‌ల్‌కు సిద్ధ‌మైంది. భారీ అంచనాల‌తో టైటిల్ హాట్ ఫెవ‌రేట్‌గా ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెట్టిన యంగిండియా దానికి త‌గ్గ‌ట్టే రాణించింది. వ‌రుస‌గా ప్ర‌త్య‌ర్థుల‌ను ఓడిస్తూ టోర్నీలో ఓట‌మి అనేది లేకుండా ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో స‌హా కీల‌క ఆట‌గాళ్లు క‌రోనాతో ప‌లు మ్యాచ్‌ల‌కు దూర‌మైనప్ప‌టికీ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌లో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేదు.

ఇదే ఊపుతో నేడు ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ గెలిచి వ‌ర‌ల్డ్‌క‌ప్ ట్రోఫీని ఎగ‌రేసుకుపోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. కాగా భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ ఫైన‌ల్ మ్యాచ్ సాయంత్రం 6:30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

ఐదో టైటిల్‌పై గురి

ఐదో టైటిల్‌పై గురి

ఇప్ప‌టివ‌ర‌కు 4 సార్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచిన భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు ఐదో టైటిల్‌పై గురిపెట్టింది. ఇప్ప‌టికే అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌ను అత్య‌ధిక సార్లు గెలిచిన జ‌ట్టుగా రికార్డు సృష్టించిన యువ భార‌త్ ఐదో సారి కూడా గెలిచి ఆ రికార్డును మరింత ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తోంది. త‌ద్వారా అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.

కాగా అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఇప్ప‌టివ‌ర‌కు 13 సార్లు జ‌ర‌గ‌గా.. ప్ర‌స్తుతం జ‌ర‌గుతున్న‌ది 14వది. ఇందులో రికార్డు స్థాయిలో టీమిండియా 8 సార్లు ఫైన‌ల్ చేర‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో యువ భార‌త్ మహ్మద్‌ కైఫ్‌, విరాట్‌ కోహ్లీ, ఉన్ముక్త్‌ చంద్‌, పృథ్వీ షా కెప్టెన్సీలో అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచింది. తాజాగా య‌ష్ ధూల్ కెప్టెన్సీలో కూడా గెల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది.

బ‌లంగా టీమిండియా

బ‌లంగా టీమిండియా

ఇంగ్లండ్‌తో ఫైన‌ల్‌కు ముందు టీమిండియా అండ‌ర్ 19 జ‌ట్టు ప‌టిష్టంగా ఉంది. కెప్టెన్ య‌ష్ ధూల్‌, వైస్ కెప్టెన్ షేక్ ర‌షీద్‌, ఓపెన‌ర్లు రఘువంశీ, హర్నూర్‌ సింగ్‌, మిడిలార్డ‌ర్‌లో నిశాంత్‌ సింధు, రాజ్‌ బవా, కౌశల్‌ తాంబేల‌తో భార‌త బ్యాటింగ్ లైన‌ప్ బ‌లంగా ఉంది. వీరంతా టోర్నీలో ఇప్ప‌టికే త‌మ స‌త్తా ఎంటో చూపించారు.

ఇక లెఫ్టామ్‌ పేసర్‌ రవి కుమార్‌, రాజ్యవర్ధన్‌, స్పిన్న‌ర్ విక్కీ ఓస్వాల్‌, దినేశ్‌ బనా, రాజ్యవర్ధన్‌ హంగర్‌గేకర్‌తో బౌలింగ్ లైన‌ప్ కూడా బ‌లంగా ఉంది. ముఖ్యంగా టోర్నీలో టీమిండియా బౌలింగ్ లైన‌ప్ ఇప్ప‌టివ‌ర‌కు స‌మిష్టిగా రాణిచింది. టోర్నీ మొత్తంలో టీమిండియా ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. గ‌త మ్యాచ్‌ల మాదిరిగానే ఫైన‌ల్‌లో కుర్రాళ్లు స‌త్తా చాటితే ఇంగ్లండ్‌ను ఓడించి ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలుచుకోవ‌డం యువ భార‌త్‌కు అంతగా క‌ష్టం కాక‌పోవ‌చ్చు.

ట‌ఫ్‌గా ఇంగ్లండ్‌

ట‌ఫ్‌గా ఇంగ్లండ్‌

ఫైన‌ల్‌లో టీమిండియా ఎదుర్కొబోతున్న ఇంగ్లండ్ కూడా చాలా టఫ్‌గా క‌నిపిస్తోంది. ఆ జ‌ట్టు కూడా టోర్నీలో ఓట‌మి అనేది లేకుండా ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బ‌లంగా ఉంది. దీంతో అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ హోరిహోరీగా సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచి 24 సంవ‌త్స‌రాలు అవుతుంది. దీంతో ఈ సారి ఎలాగైనా ప్ర‌పంచ‌క‌ప్‌ను గెల‌వాల‌ని ఆ జ‌ట్టు ప‌ట్టుద‌ల‌గా ఉంది. అలాగే ఇంగ్లండ్ అండ‌ర్ 19 జ‌ట్టు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారే గెలిచింది. 1998లో ఆ జ‌ట్టు విశ్వవిజేతగా నిలిచింది.

తుది జ‌ట్లు (అంచ‌నా)

తుది జ‌ట్లు (అంచ‌నా)

భారత్‌:

రఘువంశీ, హర్నూర్‌ సింగ్‌, షేక్‌ రషీద్ (వైస్ కెప్టెన్‌), యశ్‌ ధుల్‌ (కెప్టెన్‌), నిశాంత్‌ సింధు, రాజ్‌ బవా, కౌశల్‌ తాంబే, దినేశ్‌ బనా, రాజ్యవర్ధన్‌ హంగర్‌గేకర్‌, విక్కీ ఓస్వాల్‌, రవి కుమార్‌.

ఇంగ్లండ్‌

ఇంగ్లండ్‌

జార్జి థామస్‌, జాకబ్‌ బెథెల్‌, టామ్‌ ప్రెస్ట్‌ (కెప్టెన్‌), జేమ్స్‌ రూ, విలియమ్‌ లక్స్‌టన్‌, జార్జి బెల్‌, రెహాన్‌ అహ్మద్‌, అలెక్స్‌ హోర్టన్‌, జేమ్స్‌ సేల్స్‌, థామస్‌ అస్పిన్‌వాల్‌, జోషువా బాయ్‌డెన్‌.

Story first published: Saturday, February 5, 2022, 10:18 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+