Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను కరిచిన కోతి.. ప్రపంచకప్‌ నుంచి ఔట్!!

U-19 World Cup: Australias Fraser-McGurk ruled out after monkey scratch

పోష్ స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్‌-19 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా ఓపెనర్‌ జాక్‌ ఫ్రాసర్‌ మెక్‌ గర్క్‌ నిష్క్రమించాడు. 17 ఏళ్ల మెక్‌ గర్క్‌ను కోతి కరిచింది. ముఖం మీద కూడా గాట్లు పడ్డాయి. చికిత్స కోసం స్వదేశానికి పయనమవుతున్న నేపథ్యంలో మెక్‌ గర్క్‌ ప్రపంచకప్‌కు దూరమవుతున్నాడు అని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాజాగా ఓ ప్రకటనలో ధృవీకరించింది. చికిత్స తర్వాత మెక్‌ గర్క్‌ అందుబాటులో ఉండాడని సీఏ తెలిపింది.

గత వారం ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు విహారయాత్రకు వెళ్లింది. బయటకు వెళ్లిన మెక్‌ గర్క్‌పై అక్కడ ఉన్న ఓ కోతి దాడి చేసింది. ఈ దాడిలో అతన్ని కురవడంతో పాటు ముఖం మీద కూడా గాట్లు చేసింది. దీనికి జట్టు మెడికల్‌ వైద్య బృందం చికిత్స చేయడంతో భారత్‌తో మ్యాచ్‌లో ఆడాడు. అయితే ఏడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సిన అవసరం ఉండటంతో.. మెక్‌ గర్క్‌ తిరిగి స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో అండర్‌-19 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.

భారత్‌తో మ్యాచ్‌కు ముందే మెక్‌ గర్క్‌ను కోతి కరిచినా.. దాన్ని సీరియస్‌గా తీసుకోపోవడంతో బరిలోకి దిగాడు. భారత్‌తో మ్యాచ్‌లో డైమండ్‌ డక్‌గా మెక్‌ గర్క్‌ నిష్క్రమించాడు. కనీసం బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆసీస్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓటమి పాలు అయిన విషయం తెలిసిందే. అయితే ఐదో స్థానం కోసం ప్లే ఆఫ్‌ సెమీ ఫైనల్‌-2 ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మెక్‌ గర్క్‌ దూరమయ్యాడు.

ఆసీస్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌-1లో భారత్‌ 74 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత అండర్‌-19 జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 233 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (82 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అథర్వ అంకొలేకర్‌ (54 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు చేసారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ 43.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' కార్తీక్‌ త్యాగి (4/24) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన కంగారూలు ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. ఓపెనర్‌ సామ్‌ ఫనింగ్‌ (75) ఒంటరి పోరాటం చేశాడు.

Story first published: Thursday, January 30, 2020, 16:04 [IST]
Other articles published on Jan 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+