Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U 19 World Cup 2022: మ‌న‌ది ఫ‌స్ట్‌ ఫీల్డింగ్‌.. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌! ఫైన‌ల్ అప్‌డేట్స్‌

U 19 World Cup 2022 Final: England won the toss and elected to bat in the match against India

ఆంటిగ్వా: అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో యువ భార‌త్ మొద‌ట ఫీల్డింగ్ చేయ‌నుంది. ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ నెగ్గ‌డ‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన ఇరు జ‌ట్లు త‌మ తుది జ‌ట్ల‌లో ఎలాంటి మార్పులు లేకుండానే బ‌రిలోకి దిగుతున్నాయి. సెమీ ఫైన‌ల్‌లో ఆడిన జ‌ట్ల‌తోనే ఇరు జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్‌ను ఆడుతున్నాయి.

ఇంగ్లండ్ కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

ఇంగ్లండ్ కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

‘‘మేము మొదట బ్యాటింగ్ చేస్తాం, పిచ్ చాలా బాగుంది. ఫైనల్స్‌లో ఛేజింగ్ చేయడం ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై 230 పరుగులు చేసి, మేము మ్యాచ్ కాపాడుకోవ‌డం మాకు గొప్ప ఆత్మ‌విశ్వాసాన్ని ఇచ్చింది. సెమీ ఫైన‌ల్ మా ఆడిన జ‌ట్టులో ఎలాంటి మార్పు లేదు. అదే జ‌ట్టుతో బ‌రిలోకి దిగుతున్నాం.'' అని ఇంగ్లండ్ కెప్టెన్ టామ్ ప్రెస్ట్ తెలిపాడు.

ఇండియా కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

ఇండియా కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

‘‘టాస్ గెలిస్తే మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము. మేము సానుకూల దృక్ప‌థంతో మ్యాచ్‌ ఆడతాము. వేదిక మార్పు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు లేవు. సెమీఫైన‌ల్‌లో ఆడిన జ‌ట్టుతోనే ఫైన‌ల్‌లోనూ ఆడుతున్నాం.'' అని ఇండియా కెప్టెన్ య‌ష్ ధూల్ తెలిపాడు.

ఐదో టైటిల్‌పై గురి

ఐదో టైటిల్‌పై గురి

ఇప్ప‌టివ‌ర‌కు 4 సార్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచిన భార‌త అండ‌ర్ 19 జ‌ట్టు ఐదో టైటిల్‌పై గురిపెట్టింది. ఇప్ప‌టికే అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌ను అత్య‌ధిక సార్లు గెలిచిన జ‌ట్టుగా రికార్డు సృష్టించిన యువ భార‌త్ ఐదో సారి కూడా గెలిచి ఆ రికార్డును మరింత ప‌దిలం చేసుకోవాల‌ని భావిస్తోంది. త‌ద్వారా అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. కాగా అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ ఇప్ప‌టివ‌ర‌కు 13 సార్లు జ‌ర‌గ‌గా.. ప్ర‌స్తుతం జ‌ర‌గుతున్న‌ది 14వది. ఇందులో రికార్డు స్థాయిలో టీమిండియా 8 సార్లు ఫైన‌ల్ చేర‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో యువ భార‌త్ మహ్మద్‌ కైఫ్ నేతృత్వంలో 2002లో, విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో 2008లో, ఉన్ముక్త్‌ చంద్ నేతృత్వంలో 2012లో, పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచింది. తాజాగా య‌ష్ ధూల్ కెప్టెన్సీలో కూడా గెల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది.

 రెండున్న ద‌శాబ్దాల‌ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని..

రెండున్న ద‌శాబ్దాల‌ నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని..

మ‌రోవైపు ఇంగ్లండ్ అండ‌ర్ 19 జ‌ట్టు మాత్రం త‌మ 24 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించాల‌ని భావిస్తోంది. ఆ జ‌ట్టు చివ‌ర‌గా 1998లో అండ‌ర్ 19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచింది. ఆ త‌ర్వాత మ‌రో సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకోలేక‌పోయింది. అంతేకాకుండా 1998లో గెలిచిన ఒకే ఒక్క ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీనే ఇప్ప‌టివ‌ర‌కు ఆ జ‌ట్టు ఖాతాలో ఉంది. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి రెండున్న‌ర ద‌శాబ్దాల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ రెండో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను త‌మ ఖాతాలో వేసుకోవాలని ఇంగ్లండ్ అండ‌ర్ 19 జ‌ట్టు ప‌ట్టుద‌ల‌గా ఉంది.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

ఇండియా U19:

అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యశ్ ధుల్(కెప్టెన్‌), నిశాంత్ సింధు, రాజ‌వ‌ర్ధన్ హంగర్గేకర్, దినేష్ బనా(వికెట్ కీప‌ర్), కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్.

U19 World Cup Final, India Vs England Match Details| IND Eye 5th Title | Oneindia Telugu
ఇంగ్లాండ్ U19:

ఇంగ్లాండ్ U19:

జార్జ్ థామస్, జాకబ్ బెథెల్, టామ్ ప్రెస్ట్(కెప్టెన్‌), జేమ్స్ రెవ్, విలియం లక్స్టన్, జార్జ్ బెల్, రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్(వికెట్ కీప‌ర్), జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్‌వాల్, జాషువా బోడెన్.

Story first published: Saturday, February 5, 2022, 18:31 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+