For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U-19 వరల్డ్ కప్ హీరో రాయ్‌పై ఐపీఎల్ వేలంలో కోట్లు కుమ్మరిస్తారా?

By Nageshwara Rao
Anukul Roy

హైదరాబాద్: అనుకుల్ రాయ్... ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత యువ జట్టులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. జార్ఖండ్‌కు చెందిన ఈ లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా జనవరి 16న పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో అనుకుల్‌ రాయ్‌ దెబ్బకు న్యూగినియా 21.5 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 6.5 ఓవర్లు వేసిన రాయ్‌ 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడెన్‌లు కూడా ఉన్నాయి.

అనంతరం 65 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ కెప్టెన్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీలో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కూడా అనుకుల్ రాయ్ సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులు చేసి ఆలౌటైంది. జింబాబ్వే ఆటగాళ్లు మధేవీరే(30), శుంభు(36), రోచి(31) తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించలేకపోయారు. భారత ఆల్‌రౌండర్ అనుకుల్‌ రాయ్‌ ఈ మ్యాచ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.

7.1 ఓవర్లు వేసిన అనుకుల్ రాయ్ 4 వికెట్లు తీశాడు. అనంతరం 155 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 21.4 ఓవర్లలో జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించింది. భారత బ్యాట్స్ మె‌న్లలో శుభమ్ గిల్ (90 నాటౌట్), హర్విక్ దేశాయ్ (56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

దీంతో జింబాబ్వేపై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ విజయంతో భారత యువ జట్టు గ్రూప్ బీలో అగ్రస్ధానంలో నిలిచింది. ఇలా మ్యాచ్ విన్నింగ్స్ ఫెర్పామెన్స్‌ల చేయడంపై అనుకుల్ రాయ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

రాయ్ ఆడిన గత 11 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీసుకోవడం విశేషం. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. జనవరి 27, 28 తేదీల్లో జరిగే ఐపీఎల్ వేలం జరగనుంది. ఇదే సమయంలో అనుకుల్ రాయ్ సత్తా చాటడంతో వేలంలో రాయ్‌పై కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

అతడి గణాంకాలను దృష్టిలో పెట్టుకుని వేలంలో పాల్గొనే ప్రాంచైజీలు అనుకుల్ రాయ్‌ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 19, 2018, 15:52 [IST]
Other articles published on Jan 19, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+