For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై జట్టులోకి కుర్రాడు.. షమి స్థానంలో సీనియర్

దేశంలో క్రికెట్ పండగకు వేళైంది. రేపటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే రెండు నెలలు పాటు సాగే ఈ మెగా లీగ్‌ ఆరంభానికి ముందే కొన్ని ఫ్రాంచైజీలకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. వేలంలో రూ.కోట్లు కుమ్మరించిన ఆటగాళ్లు గాయపడుతుండటం ఫ్రాంచైజీలను కలవరపడుతున్నాయి.

ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైనా మిగిలిన మ్యాచ్‌లకు అయినా అందుబాటులోకి వస్తారని కొన్ని ఫ్రాంచైజీలు వేచిచూస్తున్నాయి. మరోవైపు గాయపడ్డ ఆటగాళ్ల స్థానాల్లో ఇతర ఆటగాళ్లతో మరికొన్ని ఫ్రాంచైజీలు భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ప్లేయర్లు వచ్చారు.

U-19 Player has joined the Mumbai Indians and Senior instead of Shami in Gujarat Titans

సర్జరీ చేయించుకుని లీగ్‌కు దూరమైన మహ్మద్ షమి స్థానంలో 32 ఏళ్ల సందీప్ వారియర్‌ను గుజరాత్ టైటాన్స్ తీసుకుంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత షమి ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల షమి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గత సీజన్‌లో గుజరాత్ ఫైనల్‌కు చేరడంలో షమి కీలకపాత్ర పోషించాడు. ఐపీఎల్‌-2023లో 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

కాగా, సందీప్ వారియర్ కేరళకు చెందినవాడు. అతడిని కనీస ధర రూ.50 లక్షలతో గుజరాత్ జట్టులోకి తీసుకుంది. 2019లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సందీప్ ఇప్పటివరకు అయిదు మ్యాచ్‌లే ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిథ్యం వహించాడు.

U-19 Player has joined the Mumbai Indians and Senior instead of Shami in Gujarat Titans

మరోవైపు ముంబై ఇండియన్స్ ఓ కుర్రాడిని జట్టులోకి ఆహ్వానించింది. అండర్-19 ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన చేసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్‌ క్వెనా మపాకాను కనీస ధర రూ.50 లక్షలకు తీసుకుంది. 17 ఏళ్ల క్వానా మపాకా అండర్-19 వరల్డ్ కప్‌లో 21 వికెట్లతో సత్తాచాటాడు. అంతేగాక 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు అందుకున్నాడు. శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో క్వెనా మపాకాను తీసుకుంది. ఐపీఎల్ వేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్‌ రూ.4.6 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, ఇటీవల బెరెన్‌డార్ఫ్ స్థానంలో ల్యూక్ వుడ్‌ను ముంబై తీసుకున్న విషయం తెలిసిందే.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్,

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, ల్యూక్ వుడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ, క్వెనా మపాకా.

Story first published: Thursday, March 21, 2024, 8:54 [IST]
Other articles published on Mar 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+