Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్‌కు చెంపపెట్టు: మిల్స్‌కు రూ. 12 కోట్లపై పీటర్సన్ సంచలనం

హైదరాబాద్: గత కొన్నాళ్లుగా విదేశాల్లో టీ20 లీగ్‌లతో బిజీగా గడుపుతున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఐపీఎల్ 10వ ఎడిషన్‌కి తాను అందుబాటులో ఉండనని ముందుగానే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం బెంగుళూరులో జరిగిన వేలంపై పీటర్సన్ స్పందించాడు.

ఇంగ్లాండ్ బౌలర్ తైమాల్ మిల్స్‌ను ఐపీఎల్ వేలంలో రూ. 12 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కొనుగోలు చేయడంపై పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 స్పెషలిస్ట్ అయిన తైమాల్‌కు ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడం టెస్టు క్రికెట్‌కు చెంపపెట్టు లాంటిదని పీటర్సన్ పేర్కొన్నాడు.

Tymal Mills' Rs 12 Crore Valuation A Slap on Test Cricket: Kevin Pietersen

టీ20 లీగ్‌ల పట్ల అభిమానాన్ని చాటుకున్న పీటర్సన్, టెస్టు క్రికెట్‌ను బతికించే బాధ్యత ఐసీసీపైనే ఉందని పేర్కొనడం విశేషం. 'ఐపీఎల్ వేలంలో తైమాల్ మిల్స్‌కు రూ.12 కోట్లు ధర పలకడం టెస్టు క్రికెట్‌కుచెంపపెట్టే. మా దేశ టీ20 స్పెషలిస్ట్ ఇక ధనిక క్రికెటర్ అయిపోయాడు' అని ట్వీట్ చేశాడు.

మరొక ట్వీట్‌లో 'అతడిని నిందించడం లేదు. టీ20 క్రికెట్ ఎంత త్వరగా వృద్ధి చెందుతుందో చూడండి. ఇక్కడ టెస్టు క్రికెట్ ఎంత అథమ స్థాయిలో ఉందో ఐపీఎల్ వేలాన్ని బట్టి అర్ధమవుతోంది. టెస్టు క్రికెట్‌ను బతికించడానికి ఐసీసీ తొందరపడాలి. లేకపోతే టెస్టు క్రికెట్ మనకు దూరం కాక తప్పుదు' అని పీటర్సన్ పేర్కొన్నాడు.

'నేను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కరినీ కించపరిచేవి కావు. ఇక్కడ మిల్స్‌ను నేను విమర్శించలేదు. అతను ట్వంటీ 20ల్లో మంచి బౌలర్. ఇంగ్లాండ్ తరపున అతను నాలుగు సంవత్సరాల క్రితమే అరంగేట్రం చేయాల్సి ఉంది' అని పీటర్సన్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+