న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ ముంగిట కోహ్లీసేన ప్రపంచ రికార్డుని బద్దలు కొట్టిన ఇంగ్లాండ్

Two weeks before World Cup 2019, England break Virat Kohli-led Indias ODI record

హైదరాబాద్: వరల్డ్‌కప్ ముంగిట ఇంగ్లాండ్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం నాటింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌ నిర్దేశించిన 341 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ అలవోకగా చేధించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. వన్డేల్లో 340 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యధికంగా నాలుగుసార్లు ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియా మూడుసార్లు

టీమిండియా మూడుసార్లు

గతంలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడుసార్లు ఈ ఘనత సాధించింది. అయితే, ఇప్పుడు ఆ రికార్డుని ఇంగ్లాండ్ అధిగమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో బాబర్‌ ఆజం (112 బంతుల్లో 115) సెంచరీతో చెలరేగా.. ఫఖర్‌ జమాన్‌(50 బంతుల్లో 57), మొహమ్మద్ హఫీజ్ (55 బంతుల్లో 59) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది.

340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని

340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని

అనంతరం లక్ష్యఛేదనలో జేసన్ రాయ్ (89 బంతుల్లో 114; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (64 బంతుల్లో 71 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి విజయం సాధించంది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 340 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు చేధించిన జట్టుగా ఇంగ్లండ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.

వన్డేల్లో 340కిపైగా పరుగులను అత్యధిక సార్లు ఛేజింగ్ చేసిన జట్లివే:

వన్డేల్లో 340కిపైగా పరుగులను అత్యధిక సార్లు ఛేజింగ్ చేసిన జట్లివే:

4 - ఇంగ్లాండ్

3 - ఇండియా

2 - దక్షిణాప్రికా

1 - ఆస్ట్రేలియా/న్యూజిలాండ్

వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ టాప్ ఫేవరేట్‌గా

వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ టాప్ ఫేవరేట్‌గా

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... ఆ తర్వాతి 3 వన్డేల్లో గెలుపొందిన ఇంగ్లాండ్‌ 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రమైన చివరి వన్డే ఆదివారం జరుగనుంది. దీంతో సొంతగడ్డపై మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ టాప్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

Story first published: Sunday, May 19, 2019, 14:14 [IST]
Other articles published on May 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X