న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ పర్యటనలో.. ఇద్దరు క్రికెటర్లపై దాడి

Two SA cricketers hospitalised after brutal attack by UK thugs

హైదరాబాద్: చూడబోతే ఇంగ్లాండ్‌లో క్రికెటర్ల దాడులు పెరిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా నలుగుతోన్న విషయం.. బెన్ స్టోక్స్ పిడిగుద్దుల వివాదం. ఇంకా ఇది విచారణలో ఉండగానే మరో ఇద్దరి క్రికెటర్ల విషయంలో దాడి జరిగింది. ఈ సారి బాధితులు మాత్రం క్రికెటర్లే. జులై 27న చోటు చేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

దక్షిణాఫ్రికాకు చెందిన జస్టిన్‌ వాట్సన్‌(20), క్రికెటర్‌ మార్క్యూస్‌ అకెర్‌మన్‌(22) క్లబ్‌ క్రికెట్‌ ఆడేందుకు కొద్ది రోజుల క్రితం లండన్‌ వచ్చారు. ఈ నేపథ్యంలో గత నెల 27న రాత్రి వీరిద్దరూ ఓ క్లబ్‌కు వెళ్లారు. ఆ తర్వాత తిరిగి బయల్దేరుతున్న సమయంలో సుమారు ఏడుగురు దుండగులు వాట్సన్‌, మార్క్యూస్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కేవలం గాయాలకే పరిమితమైంది కానీ, ఎలాంటి ప్రాణ హాని లేదంటూ తేల్చి చెప్పడంతో ఆయా క్రికెట్ క్లబ్‌ల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మార్క్‌ లేన్‌ క్లబ్‌ ఛైర్మన్‌ స్టీవ్‌ విట్సన్‌ మాట్లాడుతూ...'ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. మొత్తం ఏడుగురు దుండగులు వీరిద్దరిపై దాడికి పాల్పడ్డారు. అందులో ముగ్గురు వాట్సన్‌ ముఖంపై పిడి గుద్దుల వర్షం కురిపించారు. అతను స్పృహ తప్పి పడిపోవడంతో దుండగులు పారిపోయారు. ఆ ఘటనలో అతడి దవడలో కొన్ని పగుళ్లను వైద్యులు గుర్తించారు.

దవడ భాగంలో స్టీల్ పరికరాన్ని ఉంచాల్సి వచ్చింది. దాడికి పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. మరో క్రికెటర్ 'మార్క్యూస్‌ గతంలో కూడా ఇంగ్లాండ్‌లో పర్యటించారు. కానీ, ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది' అని చెప్పారు. ఇద్దరు క్రికెటర్లు మార్క్ లానె క్లబ్ తరపునే ఆడుతున్నారు.

Story first published: Wednesday, August 8, 2018, 16:28 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X