Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : రాహుల్ కోసం ఇద్దరు మాజీల గొడవ.. నాకేం పగ లేదన్న మాజీ లెజెండ్!

Two legends argue about KL Rahul pitiful form

టీమిండియా టెస్టు టీంలో ప్రస్తుతం అత్యంత చెత్త ప్లేయర్ ఎవరు? అనడిగితే చాలా మంది చటుక్కున చెప్పే పేరు కేఎల్ రాహుల్. ఓపెనర్‌గా వస్తున్న అతను ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. 20 పరుగులు చేస్తే అదే టాప్ పెర్ఫామెన్స్ అనుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్‌పై అన్ని వైపుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మాజీ లెజెండ్ వెంకటేశ్ ప్రసాద్ ఏమాత్రం మొహమాటం లేకుండా రాహుల్‌ను ఏకిపారేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతనిపై విమర్శల వర్షం కురిపించాడు. తన దృష్టిలో దేశంలోని టాప్ టెన్ ఓపెనర్లలో రాహుల్‌కు చోటు లేదన్నాడు.

రాహుల్‌కు మద్దతు..

రాహుల్‌కు మద్దతు..

ఇలా వెంకటేశ్ ప్రసాద్ విమర్శించడం చూసి కొందరు రాహల్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా వీరిలో ఒకడు. తాజాగా వెంకటేశ్ చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆకాష్ చోప్రా.. 'వెంకీ భాయ్, టెస్టు మ్యాచ్ జరుగుతోంది కదా. కనీసం రెండు ఇన్నింగ్సులు పూర్తయ్యే వరకైనా ఆగు. మనమంతా టీమిండియాలో ఉన్నాం. నేనేం నిన్ను విమర్శలు చేయొద్దని అడగడం లేదు. కొంచెం టైమింగ్ కూడా చేసుకోమంటున్నా అంతే. ఎంతైనా మన ఆట మొత్తం టైమింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా' అని ట్వీట్ చేశాడు.

నా విమర్శలు సబబే..

నా విమర్శలు సబబే..

ఆకాష్ చోప్రా చేసిన కామెంట్స్‌పై వెంకటేశ్ స్పందించాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేసినా ప్రయోజనం లేదని తేల్చేశాడు. 'అది అసలు పాయింటే కాదు. తను రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసినా నేను చేసిన విమర్శలు సబబే. మ్యాచ్ మధ్యలో చేసినా, ముగిశాక చేసినా తేడా ఏముంటుంది? నీ యూట్యూబ్ ఛానెల్ వీడియోలైతే బాగుంటాయి. నాకు బాగా నచ్చుతాయి' అని సూటిగా బదులిచ్చాడు. అలాగే తాను ఏదో ప్రత్యేకంగా రాహుల్‌ను టార్గెట్ చేస్తున్నానని తిడుతున్న వారికి కూడా బదులిచ్చాడు.

నాకు కక్ష లేదు..

నాకు కక్ష లేదు..

'కొంతమంది నేను ఏదో వ్యక్తిగతమైన కక్షతో రాహుల్‌ను టార్గెట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను అతని మంచి కోసమే విమర్శిస్తున్నా. ఇలాంటి ఫామ్‌లో ఉండగా అతన్ని ఇంకా ఆడించడం వల్ల ఉపయోగం లేదు. అతనికి కూడా దీని వల్ల నష్టమే. అతని కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఇప్పుడు దేశవాళీ సీజన్ కూడా ముగిసింది. ఇలాంటి సమయంలో టెస్టు జట్టులో తన స్థానం తిరిగి పొందాలంటే అతను కౌంటీ క్రికెట్ ఆడటం మంచిది. అక్కడ రాణించి తిరిగి తన స్థానాన్ని పొందాలి. పుజారా కూడా అదే చేశాడు కదా. మళ్లీ ఫామ్ అందుకొని దేశం తరఫున టెస్టులు ఆడటం అన్నిటికీ సరైన సమాధానం. కానీ అందుకోసం ఐపీఎల్ ఆడకుండా ఉండటం కుదురుతుందా?' అని వెంకటేశ్ ప్రసాద్ ప్రశ్నించాడు.

Story first published: Sunday, February 19, 2023, 21:56 [IST]
Other articles published on Feb 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+