Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాబోయే వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత్అంఫైర్లు

Two Indian umpires in ICC panel for Under-19 World Cup

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు అంఫైర్లు అనిల్ చౌధురి, సీకే నందన్‌లకు చోటు దక్కింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం 14 మందితో కూడిన అంఫైర్ల ప్యానెల్‌ను ప్రకటించింది.

న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తోన్న ఈ అండర్ 19 వరల్డ్ కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. అంఫైర్ల ప్యానెల్‌లో రాబర్ట్ బైలీ, గ్రెగొరీ బ్రాత్‌వైట్, అనిల్ చౌధురి, నిగెల్ డుగిడ్, షాన్ జార్జ్, షాన్ హేగ్, మార్క్ హౌథ్రోన్, రన్మోర్ మార్టినెజ్, సీకే నందన్, అహ్సాన్ రాజా, షోజాబ్ రాజా, తిమోతి రాబర్ట్ రాబిన్సన్, లాంగ్టాన్ రుసెరె, పాల్ విల్సన్‌లు ఉన్నారు.

వీరితో పాటు ఐసీసీ డెవల్మెంట్ ప్యానల్‌లో డేవిడ్ ఒదియాంబో, బుద్దీ ప్రధాన్, ఇయాన్ రామేజ్‌లకు కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక మ్యాచ్ రిఫరీలుగా జెఫ్ క్రోవి, దేవ్దాస్ గోవింద్జీ, గ్రామీ లా బ్రూయ్‌లు ఉన్నారు. బే ఓవల్ వేదికగా ఢిఫెండింగ్ చాంపియన్ వెస్టిండిస్, ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌కి షాన్ జార్జి, అహ్సాన్ రాజాలు ఫీల్డ్ అంఫైర్లుగా ఉంటారు.

ఇక, నాకౌట్ మ్యాచ్‌లకు సంబంధించిన అంఫైర్లు, మ్యాచ్ రిఫరీలను తర్వాత ప్రకటించనున్నట్లు ఐసీసీ పేర్కొంది. ఈ టోర్నీలో డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న వెస్టిండిస్ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. ఈ క్రమంలో 2004, 2006లో వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్ నెగ్గిన పాకిస్థాన్ రికార్డును సమం చేయాలని ఊవిళ్లూరుతోంది.

ఇండియా, ఆస్ట్రేలియా జట్లు అండర్ 19 వరల్డ్ కప్‌ను మూడు సార్లు గెలవగా.... దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఒక్కసారిగా టోర్నీ విజేతగా నిలవలేదు. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా భారత్, వెస్టిండిస్, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు ఈ టోర్నీకి ఎంతో ప్రత్యేకత ఉంది.

ఈసారి ఈ టోర్నీలో వారసులు అరంగేట్రం చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ స్టీవ్ వా వారసుడు ఆస్టిన్ వా, దక్షిణాఫ్రికా మాజీ పేస్‌బౌలర్ మకాయ ఎన్తీని కుమారుడు థండో ఎన్తీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీ కోసం ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోని అండర్ 19 జట్టు న్యూజిలాండ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

అంఫైర్లు:
రాబర్ట్ బైలీ, గ్రెగొరీ బ్రాత్‌వైట్, అనిల్ చౌధురి, నిగెల్ డుగిడ్, షాన్ జార్జ్, షాన్ హేగ్, మార్క్ హౌథ్రోన్, రన్మోర్ మార్టినెజ్, సీకే నందన్, అహ్సాన్ రాజా, షోజాబ్ రాజా, తిమోతి రాబర్ట్ రాబిన్సన్, లాంగ్టాన్ రుసెరె, పాల్ విల్సన్‌

మ్యాచ్ రిఫరీలు:
డేవిడ్ ఒదియాంబో, బుద్దీ ప్రధాన్, ఇయాన్ రామేజ్‌

Story first published: Thursday, January 4, 2018, 9:13 [IST]
Other articles published on Jan 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+