ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం.. సెపరేటుగా రెండు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. వివరాలివే

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 18మంది సభ్యులతో కూడిన జట్టును అధికారికంగా ప్రకటించింది. సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో జూలై 7న జరిగే తొలి టీ20 మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు. ఇక ఇటీవల కోవిడ్ -19 బారిన పడ్డ రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో జరగబోయే అయిదో టెస్ట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో బుమ్రా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక ఆ తర్వాత ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్ నుంచి రోహిత్ శర్మ పూర్తిస్థాయిలో జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టబోతున్నాడు. చాలా రోజులుగా ఇండియా కెప్టెన్లు మారుతున్న సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా తదితరులు కెప్టెన్లుగా గత ఏడాది కాలంగా పలు సిరీస్‌లకు వ్యవహరించారు. ఇక రెగ్యులర్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా ఇక పూర్తిస్థాయిలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తించనున్నాడు.

ఉమ్రాన్ మాలిక్ స్థానం పదిలం
ఐర్లాండ్‌తో జరిగిన రెండోది మరియు చివరి టీ20లో అద్భుత ప్రదర్శన చేసిన ఉమ్రాన్ మాలిక్ తిరిగి జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇక రాహుల్ త్రిపాఠికి ఐర్లాండ్ సిరీస్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే వీలు చిక్కలేదు. దీంతో అతను ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్లో అరంగేట్రం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక అతనికి తొలి టీ20లో మాత్రమే జట్టులో చోటు దక్కింది. అలాగే టెస్ట్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవలి దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడలేదు.. ఇక ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ల కోసం అతను చివరి రెండు టీ20లకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అర్షదీప్ సింగ్ కేవలం తొలి టీ20కి మాత్రమే
ఇక రుతురాజ్ తొలి టీ20లో చోటు దక్కించుకున్నా.. రెండు, మూడు టీ20లకు మాత్రం జట్టులో ఉండడు. రిషబ్ పంత్ సైతం తొలి టీ20కి అందుబాటులో ఉండడు. సిరీస్‌లోని రెండు, మూడో మ్యాచ్‌లకు తిరిగి జట్టులోకి వస్తాడు. అర్షదీప్ సింగ్ సైతం తొలి టీ20లో మాత్రమే ఆడతాడు. ఇక తొలి టీ20కి మిస్సయిన ప్లేయర్లు.. అప్పటికే చివరి టెస్ట్‌లో ఆడతారు కాబట్టి వారికి విశ్రాంతి కోసం ఇలా బీసీసీఐ ప్లాన్ చేసింది. జూలై 7, 9, 10 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. ఇక జులై 5న అయిదో టెస్ట్ ముగియనుంది. మధ్యలో ఒక్కరోజే గ్యాప్ ఉండడంతో బీసీసీఐ తొలి టీ20కి వేరుగా, రెండు, మూడు టీ20లకు వేరుగా సెపరేట్ జట్లను ప్రకటించింది.

తొలి టీ20కి భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
2వ, 3వ టీ20లకు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్
.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications