Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు గంటల్లో రెండు హ్యాట్రిక్స్, ఇలా జరగడం రెండోసారి

Two hat-tricks in one day a first for the Plunket Shield

హైదరాబాద్: న్యూజిలాండ్‌లో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఫ్లంకెట్ టోర్నమెంట్‌ చాలా కాలం తర్వాత రెండు హ్యాట్రిక్‌లు ఒకే రోజు నమోదు చేసింది. న్యూజిలాండ్‌ దేశవాళీ టోర్నీ ప్లంకెట్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల గంట వ్యవధిలోపే హ్యాట్రిక్‌ నమోదవడమే కాకుండా ఈ ఇద్దరు బౌలర్లు కూడా తమ రెండేసి ఓవర్లలోనే ఇది సాధించడం విశేషం.

112 ఏళ్ల్ల ప్లంకెట్‌ షీల్డ్‌ చరిత్రలో ఇలా ఒకే రోజు రెండు హ్యాట్రిక్‌లు రావడం ఇలా రెండో సారి జరిగింది. తొలిసారి. ముందుగా వెల్లింగ్టన్‌ ఆటగాడు లోగన్‌ వాన్‌ బీక్‌.. కాంటర్‌బరీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తన 4, 6వ ఓవర్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. మరో గంటలోపే ఆక్లాండ్‌ ఆటగాడు మాట్‌ మెక్‌ఇవాన్‌.. నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌పై 26, 28వ ఓవర్లో హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. అంతేకాదు వీరిద్దరూ చిన్నప్పడు ఒకే పాఠశాలలో చదవడం మరో విశేషం.

ఇది ఇటీవల జరిగిందైతే చరిత్రలో ఇదే టోర్నమెంట్‌లో ముందే డబుల్ హ్యాట్రిక్ జరిగింది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ గణాంకుడు ఫ్రాన్సిస్ పేనె ధ్రువీకరించారు. 1906/07 సంవత్సరాల మధ్య ఇలాగే ఒకేరోజు డబుల్ హ్యట్రిక్ నమోదైందని పేర్కొన్నారు.

ఆ క్రికెటర్ల పేర్లు లోగాన్‌ వాన్‌ బీక్‌, మాట్‌ మెక్‌ఎవాన్‌. ప్లంకెట్‌ షీల్ట్‌ టోర్నీలో ప్రస్తుతం వెలింగ్టన్‌కు ఆడుతున్న వాన్‌ బీక్‌.. కాంటెర్బరీ జట్టుతో మ్యాచ్‌లో శుక్రవారం హ్యాట్రిక్‌ తీశాడు. ఇది జరిగిన గంట లోపే ఆక్లాండ్‌ బౌలర్‌ మాట్‌ ఎవాన్‌.. నార్తర్న్‌ డిస్టిక్స్‌ జట్టుపై హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.

Story first published: Saturday, March 3, 2018, 12:31 [IST]
Other articles published on Mar 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+