Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Video: టీ20 క్రికెట్‌లో నవ్వులు పూయించే సంఘటన.. ఇద్దరు బ్యాటర్లు పడిపోయినా రనౌట్ కాలేదు!

Maharashtra Premier League: మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2025లో రాయ్‌గఢ్ రాయల్స్, కొల్లాపూర్ టస్కర్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ సమయంలో రాయ్‌గఢ్ జట్టుకు చెందిన ఇద్దరు బ్యాటర్లు పరుగులు తీస్తుండగా.. ఒకరినొకరు ఢీకొని పిచ్‌పై పడిపోయారు. అయితే కొల్లాపూర్ జట్టు వారిలో ఏ ఒక్కరినీ రనౌట్ చేయలేకపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అనంతరం మొదట బ్యాటర్ల గురించి కొద్దిగా బాధ అనిపిస్తుంది.. ఆపై ఫీల్డింగ్ జట్టుపై నవ్వు కూడా వస్తుంది.

నిజానికి మ్యాచ్ సమయంలో రాయ్‌గఢ్ రాయల్స్ బ్యాటర్లు రెండో పరుగు కోసం పిచ్‌పై పరుగెడుతుండగా.. ఇద్దరు బ్యాటర్లు ఒకరినొకరు ఢీకొని కిందపడిపోయారు. ఈ పరిస్థితిలో ఫీల్డింగ్ జట్టుకు బ్యాటర్లను రనౌట్ చేసే అవకాశం లభించింది. ఢీకొన్న తర్వాత ఒక బ్యాటర్ బౌలర్ వైపు పరిగెత్తి క్రీజులోకి చేరుకోగా.. రెండో బ్యాటర్ కొంతసేపు అక్కడే పడి ఉన్నాడు. కానీ అతనికి అవకాశం దొరకగానే వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు. ఫీల్డర్ బంతిని చేతిలోకి తీసుకున్న తర్వాత వికెట్‌కు కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ బంతి వికెట్‌కు తగలకుండా నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు బ్యాటర్లు ఔట్ కాకుండా బయటపడ్డారు.

Two Batters Fall on Pitch Still Not Run Out Viral Video from MPL 2025

రాయ్‌గఢ్ రాయల్స్ విజయం
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కొల్హాపూర్ టస్కర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కొల్హాపూర్ తరఫున బ్యాటింగ్ చేసిన అంకిత్ బావ్నే అత్యధికంగా 57 పరుగులు చేశాడు. వీరితో పాటు సిద్ధార్థ్ మాత్రే 31, ఆనంద్ 26, సచిన్ 23 పరుగులు చేశారు. రాయ్‌గఢ్ రాయల్స్ తరఫున బౌలింగ్ చేసిన నిఖిల్ కదమ్ 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని రాయ్‌గఢ్ రాయల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రాయ్‌గఢ్ రాయల్స్ తరఫున బ్యాటింగ్ చేసిన విక్కీ ఓస్వాల్ 54 బంతుల్లో అత్యధికంగా 74 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో విక్కీ 11 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. వీరితో పాటు సిద్ధేశ్వర్ 34 బంతుల్లో 39 పరుగులు, నీరజ్ జోషి 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రాయ్‌గఢ్ రాయల్స్ ఈ మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది.

Story first published: Saturday, June 21, 2025, 12:51 [IST]
Other articles published on Jun 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+