Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కండలు పెంచిన బుమ్రా: ట్విట్టర్‌లో అమ్మాయిలు ఫిదా

Twitteratis hail Jasprit Bumrah’s fitness as he shows off his six-pack abs

హైదరాబాద్: గత కొంత కాలంగా ఫిట్‌నెస్ కోసం టీమిండియా క్రికెటర్లు తెగ కష్టపడుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో జట్టులోని మిగత ఆటగాళ్లు కూడ ఆ దిశగా పయనిస్తున్నారు. జట్టులోని క్రికెటర్లంతా కెప్టెన్ బాటలో నడుస్తున్నారు.

తాజాగా టీమిండియా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా శుక్రవారం ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. కొద్దిసేపట్లోనే అది వైరల్‌గా మారింది. 'మనకు మనమే నిరంతరం మెరుగవ్వాలంటే అంకిత భావం, కష్టపడడం అవసరం' అని తన సిక్స్ ప్యాక్‌తో కూడిన ఫోటోని బుమ్రా జత చేశాడు.



ఈ ఫోటో యువతకు తెగనచ్చేసింది. ముఖ్యంగా అమ్మాయిలు బుమ్రా ఫిజిక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'బుమ్రా మీ ఫిజిక్‌ను అందంగా మార్చుకున్నారు' అని పొగడ్తల వర్షం కురిపించారు. 'స్టే ఫిట్, కొత్త శిఖరాలను అధిరోహించు బుమ్రా' అంటూ రిప్లై ఇస్తున్నారు.

భారత క్రికెట్‌ జట్టులో అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే బుమ్రా రెగ్యులర్‌ పేసర్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. డెత్‌ ఓవర్లలో తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తాడు. ఇప్పటి వరకు 28 వన్డేలాడిన ఈ బుమ్రా వన్డేల్లో 52 వికెట్లు, టీ20ల్లో 40 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, November 18, 2017, 17:09 [IST]
Other articles published on Nov 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+