హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో మనం చూసిన అత్యుత్తమ ఫాస్ బౌలర్లలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఒకడు. ఈ బౌలర్‌ని అటు పాకిస్థాన్‌కు చెందిన అభిమానులతో పాటు ఇటు భారత్‌కు చెందిన అభిమానులు సైతం ఎంతగానో ఇష్టపడతారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అయితే సోమవారం షోయబ్ అక్తర్ చేసిన ఓ ట్వీట్‌కు ఇరు దేశాలకు చెందిన అభిమానులతో పాటు నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో అక్తర్‌పై జోకులు వేయడం మొదలుపెట్టారు. ఇంతకీ అక్తర్ చేసిన ఆ ట్వీట్ ఏంటో ఒక్కసారి చూడండి.
పాకిస్థాన్‌కు చెందిన షమీనా అనే మహిళ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారు. ఆమెను కలిసిన సందర్భంగా షోయబ్ ఆమెతో పాటు కలిసి ఉన్న ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అంతేకాదు 'ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఫస్ట్ లేడీ ఆఫ్ పాకిస్తాన్‌ను కలిసినందుకు సంతోషంగా ఉంది. షమీనా నిన్ను దేశం గర్విస్తోంది' అంటూ ఇంగ్లీషులో తప్పు తప్పుగా ట్వీట్ చేశారు.
ఇంకేముంది ఈ ట్వీట్‌ను చూసిన అభిమానులు షోయబ్‌ను టార్గెట్ చేశారు. ఇంగ్లీషు మాట్లాడే పాకిస్థానీయులపై షోయబ్ అక్తర్ సర్జికల్ దాడులు చేశాడండూ ట్విట్టర్‌లో జోకులు వేశారు. ఇంకొందరైతే ఫస్ట్ లేడీ ఆఫ్ పాకిస్థాన్ అని రాశావు... ఆమె ఏమైనా పాకిస్తాన్ ప్రెసిడెంట్ భార్యా? అని ప్రశ్నించారు.
చెత్త డ్రెస్సింగ్ రూమ్: 1996లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై అక్తర్
ట్విట్టర్‌లో తనపై వచ్చిన జోకులను చూసుకున్న షోయబ్ కొన్ని గంటల తర్వాత తన తప్పు తెలుసుకుని పాత్ ట్వీట్‌ని తన ట్విట్టర్ ఖాతా నుంచి తొలగించాడు. అనంతరం తిరిగి ఎటువంటి తప్పు లేకుండా ట్వీట్ చేయడం గమనార్హం.